ఆరెంజ్ ఆర్మీని ఆపతరమా.?

ఆరెంజ్ ఆర్మీని ఆపతరమా.?
  • నేడు ముంబైతో సన్‌‌రైజర్స్‌ ఢీ
  • మరో విజయంపై కన్నేసిన హైదరాబాద్‌
  • ఆత్మవిశ్వాసంలో రోహిత్‌ సేన
  • మ్యాచ్‌ రా.8 గంటల నుంచి స్టార్‌ ‌స్పోర్ట్స్ లో

వరుస విజయాలతో జోరు మీదున్న సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ .. సొంతగడ్డపై మరో పోరుకు సిద్ధమైంది.  ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో శనివారం తలపడనుంది. హ్యాట్రిక్‌ విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆరెంజ్‌ఆర్మీ.. ఈ మ్యాచ్‌ లోనూ విజయం సాధించి తనస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు గత మ్యాచ్‌ లో గెలుపుబాట పట్టిన ముంబై.. అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది.

అందరి దృష్టి బెయిర్‌‌‌‌స్టో పైనే..

అరంగేట్రం చేసిన తొలి సీజన్‌ లోనే అదరగొడుతున్న రైజర్స్‌ వికెట్‌ కీపర్‌‌‌‌ బ్యాట్స్‌ మన్‌ జానీ బెయిర్‌‌‌‌స్టోపై ఈ మ్యాచ్‌ లో అందరి దృష్టి నెలకొని ఉంది. విధ్వంసక ఓపెనర్‌‌‌‌ డేవిడ్‌ వార్నర్‌‌‌‌తో కలిసి జట్టుకు శుభారంభాలు అందించడంతో పాటు మెరుపు వేగంతో పరుగులు సాధిస్తున్నాడు. దీంతో గత సీజన్‌ వరకూ పటిష్టమైన బౌలింగ్‌ కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన ఆరెంజ్‌ ఆర్మీ ఈసారి  బ్యాటింగ్‌లో దూకుడు చూపిస్తోంది. రెగ్యులర్‌‌‌‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బరిలోకి దిగకున్నా కూడా ఆ లోటు తెలియకుండా బ్యాట్స్‌ మెన్‌ చెలరేగుతున్నారు. అయితే టాపార్డర్‌‌‌‌లో బెయిర్‌‌‌‌స్టో,వార్నర్‌‌‌‌, విజయ్‌ శంకర్‌‌‌‌ రాణిస్తున్నా.. మిడిలార్డర్‌‌‌‌ సత్తా చాటాల్సి ఉంది. ఢిల్లీ డేర్‌‌‌‌డెవిల్స్‌ తో జరిగిన గత మ్యాచ్‌ లో 130 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి ఛేజ్‌ చేసింది. దీని పై దృష్టిసారించాల్సి ఉంది. మనీశ్‌ పాండే, దీపక్‌ హూడా విఫలమవుతుండగా.. యూసుఫ్‌ పఠాన్‌ స్థాయికి తగ్గట్లుగా రాణించడంలేదు. ఇక బౌలింగ్‌ లో ఆఫ్గనిస్తాన్‌ ద్వయం మహ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్‌ అదరగొడుతున్నా రు. ముఖ్యంగా నబీ ఆరంభంలో వికెట్లు తీయడంతోపాటు బ్యాట్‌ తోనూ పరుగులు రాబడుతున్నా డు. గత మ్యాచ్‌ లో స్టాండిన్‌ కెప్టెన్‌ భువనేశ్వర్‌‌‌‌ కుమార్‌‌‌‌ ఫామ్‌ లోకి వచ్చాడు. పేసర్లలో సందీప్‌‌‌‌ శర్మ, సిద్ధార్థ్‌‌‌‌ కౌల్‌ రాణిస్తున్నారు. టీమ్‌ ఇదే జోరును కొనసాగించాలని మేనేజ్‌ మెంట్‌ ఆశిస్తోంది.

బ్యాటింగ్‌ లో నిలకడ సాధించేనా

సీజన్‌ ఆరంభంలో ఓటముల పాలై అనంతరం గాడిన పడే ముంబై ఇండియన్స్‌ ఈసారి కూడా అదే తీరు కొనసాగిస్తుంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ లాడిన ముంబై.. రెండింటి లో గెలుపొంది అంతే సంఖ్యలో పరాజయాలు నమోదు చేసింది.చెన్నై సూపర్‌‌‌‌కింగ్స్‌ తో జరిగిన గత మ్యాచ్‌ లో బ్యాటింగ్‌ లైనప్‌‌‌‌ తంటాలు పడింది. ఓపెనర్లు విఫలం కాగా సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌ , పాండ్ యా,కీరన్‌ పొ లార్డ్‌ అండతో 170 పరుగుల మార్కును దాటింది. సాధ్యమైనంత త్వరగా జట్టు గాడిన పడాల్సి న అవసరముంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ,క్వింటన్‌ డికాక్‌ , యువరాజ్‌ సింగ్‌ సత్తా చాటాల్సిన అవసరముంది. ఇక బౌలింగ్‌ లో కొత్త కుర్రాడు జాసన్‌ బెరెన్‌ డార్ఫ్‌ , జస్‌ ప్రీత్ బుమ్రా,హార్దిక్‌ పాండ్ యా సత్తాచాటుతున్నా రు. ఏదేమైనా ఈ మ్యాచ్‌ లో ముంబై బ్యాట్స్‌ మెన్‌ బ్యాట్‌ ఝులిపించాల్సి ఉంది.

జట్లు (అంచనా)

సన్‌‌‌‌రైజర్స్‌ హైదరాబాద్‌ : వార్నర్‌‌‌‌, బెయిర్‌‌‌‌స్టో,మనీశ్‌ , హుడా, విజయ్‌ , యూసుఫ్‌ , రషీద్‌ /విలియమ్సన్‌ , భువనేశ్వర్‌‌‌‌ (కెప్టెన్‌ ), సందీప్‌‌‌‌, కౌల్‌ ,నబీ.

ముంబై ఇండియన్స్‌ : రోహిత్‌ (కెప్టెన్‌ ), డికా క్‌ ,సూర్యకుమార్‌‌‌‌, యువరాజ్‌ /ఇషాన్‌ , పొ లార్డ్‌ ,హార్దిక్‌ , క్రునాల్‌ , బెరెన్‌ డార్ఫ్‌ , చహర్‌‌‌‌,బుమ్రా,మెక్లె నగన్‌ .