
పారదర్శకమైన ప్రజాపాలనను అందించి ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్లో జరిగిన రిపబ్లిక్‌డే వేడుకల్లో ఆయన మాట్లాడారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో సగటున రోజుకు 75 వేల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతోందన్నారు. జిల్లాలో 22 హాస్పిటళ్లలో రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆరోగ్య శ్రీ పథకం కింద గతేడాది 23,780 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించారన్నారు. 2023–24 యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లా రైతుల రూ.89.86 కోట్లు జమ అయ్యాయన్నారు. స్త్రీ నిధి కింద జిల్లాలోని 1322 మహిళా సంఘాలకు రూ.108 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు.