తుఫాను తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచన

తుఫాను తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచన

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను తీరం దాటింది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో మంగళవారం (అక్టోబర్ 28) అర్థరాత్రి 12.30 తర్వాత తీరం దాటినట్లు భారత వాతవరణ శాఖ తెలిపింది. మోంథా తుఫాను ఆంధ్రప్రదేశ్‎పై తీవ్ర ప్రభావం చూపించింది. మోంథా దెబ్బకు ఏపీ చిగరుటాకులా వణికిపోయింది. తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. 

భారీ వర్షం, వరదలతో రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. వేల ఎకరాల్లో పంట నీట కొట్టుకుకోవడంతో రైతన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు బస్సులు, రైళ్లు, విమానాలు రద్దై రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రాష్ట్రం మోంథా తుఫాను గండం నుంచి గట్టెక్కడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు కీలక సూచనలు చేసింది. తుఫాను తరువాత తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు సూచించింది. 

తుఫాను తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • వేడిచేసిన / క్లోరినేటెడ్ నీరు మాత్రమే తాగాలి
  • అధికారికంగా సమాచారం వచ్చేవరకు షెల్టర్/ఆశ్రయంలో ఉన్నవారు తిరిగి వెళ్లవద్దు
  • విరిగిన విద్యుత్ స్తంభాలు, వదులుగా ఉండే తీగలు /తెగిన తీగలు, ఇతర పదునైన వస్తువుల నుండి జాగ్రత్తలు తీసుకోండి.   
  • దెబ్బతిన్న/పడిపోయిన భవనాల్లోకి ప్రవేశించవద్దు.
  • దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను/వస్తువులను వాడే ముందు వాటిని ఎలక్ట్రీషియన్ చేత తనిఖీ చేయించండి.