ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి భద్రత పెంపు

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి భద్రత పెంపు

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రభుత్వం భద్రత పెంచింది. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంతో పాటు 4ప్లస్ 4 గన్మెన్స్ను కేటాయించింది. ఆర్ముర్, హైదరాబాద్లో ఆయనకు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలను కేటాయించింది. కాగా ఇటీవలె ఆయనపై కిల్లెడ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ దాడికి యత్నించాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

ఏం జరిగింది..?

కిల్లెడ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ లావణ్య కుటుంబంతో జీవన్ రెడ్డికి రాజకీయ విభేదాలున్నాయి. జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన ప్రసాద్ ఎమ్మెల్యేను కలవాలని చెప్పడంతో సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించారు. అయితే ప్రసాద్ ను చూసిన ఎమ్మెల్యే ఎందుకు వచ్చావని తిడుతూ బయటకు పంపే ప్రయత్నం చేశారు. దీంతో జీవన్ రెడ్డి, ప్రసాద్ మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రసాద్ ను నెట్టేయడంతో అతని వద్ద తుపాకీ ఉన్న విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తించాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా..పోలీసులు ప్రసాద్ ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్న ప్రసాద్ గౌడ్

లావణ్యపై వచ్చిన అవినీతి ఆరోపణలతో పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌ అధికారులు ఆమెను 6 నెలలు సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. దీనికి కారణం జీవన్‌‌‌‌‌‌‌రెడ్డి అనే అనుమానంతో ఆమె భర్త ప్రసాద్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే  జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇంటికి వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.