ప్రజాప్రతినిధుల గౌరవవేతనం పెంపుపై వెనక్కి తగ్గిన సర్కార్

ప్రజాప్రతినిధుల గౌరవవేతనం పెంపుపై వెనక్కి తగ్గిన సర్కార్

స్థానిక ప్రజాప్రతినిధుల వేతనాలు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని జీహెచ్ఎంసీ సహా మున్సిపల్ ఛైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్, మేయర్లు, డిప్యూటీ మేయర్లు,  కౌన్సిలర్లు, వార్డు మెంబర్ల వేతనాలను 30 శాతం పెంచుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. జులై నుంచి  వేతనాలను పెంచుతున్నట్లు తెలిపింది.అయితే తాజాగా  ఈ ఉత్వర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు  మరో ఉతర్వు జారీ చేసింది ప్రభుత్వం.