సింగరేణి కార్మికుల పిల్లలకు మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్లు!

సింగరేణి కార్మికుల పిల్లలకు మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్లు!

హైదరాబాద్, వెలుగు : కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  బెల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరియాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సింగరేణి కార్మికులు, నిర్వాసితుల పిల్లలకు రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. ఒక్కో కాలేజీలో 6 నుంచి 10 శాతం సీట్లను వారి కోసం రిజర్వ్ చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే గోదావరి ఖని, మంచిర్యాల, కొత్తగూడెంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు అయ్యాయి. ప్రస్తుతం ఈ కాలేజీల్లో 400 మంది స్టూడెంట్లు ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫస్టియర్ చదువుతున్నారు. ఈ ఏడాది నుంచి భూపాలపల్లి,  ఆసిఫాబాద్ జిల్లాల్లో కాలేజీల పర్మిషన్  కోసం నేషనల్ మెడికల్  కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాష్ట్ర మెడికల్  ఎడ్యుకేషన్  డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దరఖాస్తు చేసింది.

ఈ కాలేజీలకు పర్మిషన్  వస్తే ఈ ఏడాది నుంచే ఫస్టియర్ క్లాసులు ప్రారంభమవుతాయి. ఇప్పటికే ఉన్న 3 కాలేజీల్లో 400 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, కొత్తగా ఏర్పాటవుతున్న రెండు కాలేజీల్లో రెండు వందల సీట్లు యాడ్  అవుతాయి. మొత్తం ఈ 600 సీట్లలో 36 నుంచి 60 సీట్లను సింగరేణి రిటైర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు, కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మైన్స్ కోసం భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితుల పిల్లలకు రిజర్వ్  చేయడంపై చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రావు ఈ అంశాన్ని ప్రస్తావించారు.

గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన కాలేజీకి సింగరేణి రూ.500 కోట్లు కేటాయించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ ఎంబీబీఎస్  సీట్లలో కచ్చితంగా రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రి ప్రకటించారు. మంథని నియోజకవర్గం సెంటినరీ కాలనీలో ఏర్పాటు చేసిన జేఎన్టీయూ కాలేజీలో సింగరేణి కార్మికుల పిల్లలకు సీట్లు కేటాయించారు. అలాగే కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెల్ట్ ఏరియాలో ఏర్పాటు చేస్తున్న అన్ని మెడికల్ కాలేజీల్లో కార్మికులు, నిర్వాసితుల పిల్లలకు సీట్లు రిజర్వ్  చేయాలని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, లీడర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఏడాది ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కార్మికుల పిల్లలు, వారితో పాటే నిర్వాసితుల పిల్లలకు సీట్లు రిజర్వ్ చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు.

అడ్డంకులు లేవు

ఎంబీబీఎస్  సీట్లను కార్మికులు, నిర్వాసితుల పిల్లలకు రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేవని మెడికల్  ఎడ్యుకేషన్  ఆఫీసర్లు చెబుతున్నారు. ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా కౌన్సెలింగ్  కోసం 15 శాతం సీట్లను కేటాయించగా మిగిలిన సీట్లను ఎలాగైనా భర్తీ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందంటున్నారు. ప్రైవేటు మెడికల్  కాలేజీల్లోని బీ కేటగిరీ  సీట్లను పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే కేటాయించేలా నిబంధనల్లో గతేడాది ప్రభుత్వం మార్పులు చేసిన అంశాన్ని అధికారులు ఉదాహరణగా చెబుతున్నారు. ఇదే పద్ధతిలో కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరియాల్లోని కాలేజీల్లో కోటా పెట్టవచ్చని అంటున్నారు.

రాజకీయ అస్త్రంగా రిజర్వేషన్లు

సింగరేణి కార్మికులు, రిటైర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్మికులు, నిర్వాసితుల ఓట్లు అధిక సంఖ్యలో ఉన్న కొత్తగూడెం, మంథని, రామగుండం, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పినపాక, ఇల్లందు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో గతేడాది టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్  తరపున పోటీచేసిన వాళ్లంతా ఓడిపోయారు. రామగుండం, సత్తుపల్లి మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు. రామగుండంలో ఫార్వర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  బ్లాక్  తరపున పోటీచేసిన కోరుకంటి చందర్, సత్తుపల్లిలో టీడీపీ తరపున పోటీ చేసిన సండ్ర వెంకట వీరయ్య గెలిచారు. ఎన్నికల తర్వాత చందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సండ్ర, కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలంతా బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి జంప్  చేశారు. వీళ్లలో చాలా మందిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్లు తీసుకొస్తే, ఎన్నికల్లో దీన్నో అస్త్రంగా వాడుకోవచ్చని అధికార పార్టీ లీడర్లు భావిస్తున్నారు.