కుట్రపూరితంగానే రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది

కుట్రపూరితంగానే రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది

తెలంగాణ ప్రభుత్వం కుట్రపూరితంగానే రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని బీఎస్పీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.  వీఆర్వోలకు గత 14 నెలల నుంచి జాబ్ చార్ట్ ఇవ్వకుండా సతాయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 15 రోజుల్లోనే ఇద్దరు వీఆర్ఏలు పే స్కేల్ కోసం ప్రాణాలు తీసుకున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి రూ. 10,500 అరకొరగా జీతమిచ్చి.. గ్రామాలలో 30 రకాల పనులు చేయించుకోవడం నిలువు దోపిడి కాకపోతే మరేంటని ఆయన ప్రశ్నించారు. మీరు రెండు సంవత్సరాల క్రితం చట్టంలో అనుభవదారుని కాలం ఏక పక్షంగా తీసేసి, ధరణి పోర్టల్ బలవంతంగా రుద్ది, కౌలు రైతులకు రైతుబంధు లేకుండా చేసి, అసైన్డ్ భూములను గుంజుకున్నపుడే మీరెవరి పక్షమో ప్రజలకు తెలిసిందని ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు.