
- లేబర్ పర్సంటేజీ పెంచితేనే కేంద్రం నుంచి నిధులు
- మెటీరియల్కాంపోనెంట్ బిల్లులు రూ. కోట్లలో పెండింగ్
- ఎక్కువమంది కూలీలతో పనులు చేయించాలని ఆఫీసర్లపై ఒత్తిడి
- ఒక్కో గ్రామంలో 300 మంది కూలీల టార్గెట్
నల్గొండ, వెలుగు: ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల బిల్లులు చెల్లించేందుకు సర్కారు పడరాని పాట్లు పడుతోంది. గతేడాది గ్రామాల్లో చేపట్టిన శ్మశానవాటికలు, రైతు వేదికలు, చెత్త డంపింగ్‌యార్డులు, సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనాలతోపాటు, ఇతర మెటీరియల్కాంపోనెంట్పనులకు సంబంధించిన బిల్లులు కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులు చేసిన సర్పంచులు, కాంట్రాక్టర్లు బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ రాష్ట్ర సర్కార్వద్ద ఫండ్స్లేకపోవడంతో ఏడాది కాలంగా పేమెంట్స్ఆగిపోయాయి. ఈ బిల్లులు పేమెంట్చేయాలంటే గ్రామాల్లో లేబర్ వర్క్స్ జరిగితే తప్ప సాధ్యం కాదని తేలిపోయింది. దీనికోసం ప్రస్తుతం సర్కారుఉపాధి కూలీలను పోగేసే పనిలో పడింది. సాధారణంగా వేసవిలో ఉపాధి పనులకు డిమాండ్ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో ఎంత ఎక్కువ పనులు జరిగితే పర్సంటేజీ ప్రకారం మెటీరియల్ కాంపోనెంట్ అంతకంతకు పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెలలో ప్రతి గ్రామంలో 300 మంది కూలీలను ఉపాధి పనులకు తరలించాలని ఆఫీసర్లకు టార్గెట్ పెట్టింది. కానీ ఓవైపు ఎండలు మండిపోతుండటం, పనులు జరిగే ప్రదేశాల్లో కనీస వసతులు కూడా కల్పించకపోవడంతో కూలీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మరోవైపు నెల రోజుల నుంచి లేబర్‌కు చెల్లించాల్సిన వేజ్ పేమెంట్స్కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో సర్కారుపెట్టిన టార్గెట్ఎలా పూర్తిచేయాలో అర్థంగాక ఫీల్డ్ స్టాఫ్ సతమతమవుతున్నారు.
కూలి గిట్టుబాటు కావట్లే..
ఈ సీజన్లో జరుగుతున్న ఉపాధి పనులు కూలీలకు గిట్టుబాటు కావడం లేదని చెబుతున్నారు. ఫిబ్రవరి నుంచి ఇవ్వాల్సిన సమ్మర్ అలవెన్స్గత మూడు నెలల నుంచి ఇయ్యట్లే. ఇది చాలదన్నట్టుగా ప్రస్తుతం కూలీలకు సగటున రూ.120కు మించి కూలి గిట్టుబాటు కావడం లేదు. గతంలో సమ్మర్అలవెన్స్తో కలిపి రోజువారీ వేతనం కనీసం రెండొందల వరకు వచ్చేది. కానీ మారిన కొత్త సాఫ్ట్‌వేర్‌లో కూలీలకు సమ్మర్అలవెన్స్ రావడం లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. తాజా లెక్కల ప్రకారం ఒక్కో గ్రామంలో సగటున రోజుకు 50 నుంచి 100 మంది కూలీలు మాత్రమే పనులకు వస్తున్నారు. దీన్ని రెండింతలు పెంచడం అంటే కష్టమేనని ఉపాధి స్టాఫ్ అంటున్నారు. కూలీల్లో ఎక్కువభాగం వృద్ధులు, మహిళలు ఉంటున్నారు. కూలీ గిట్టుబాటు కావడం లేదన్న ఉద్దేశంతో మగవాళ్లు ఉపాధి పనుల వైపు మొగ్గుచూపడం లేదు. గడిచిన రెండు నెలల నుంచి ఉపాధి డబ్బులు సక్రమంగా పేమెంట్ చేయడం లేదు. కొత్త సాఫ్ట్‌వేర్‌లో తరచూ ఇబ్బందులు తలెత్తుతుండడంతో పేమెంట్స్ఆలస్యమవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం మార్చి వరకు కూలీల డబ్బులు క్లియర్ చేశారు. ఇంకా ఏప్రిల్‌నెల వేజ్ పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. ప్రతివారం జనరేట్ కావాల్సిన పేమెంట్స్టెక్నికల్ ప్రాబ్లమ్స్వల్ల నెలల తరబడి ఆగాల్సి వస్తోందని ఉపాధి స్టాఫ్ చెబుతున్నారు. ఈ సమస్యల్ని పట్టించుకోకుండా గతేడాది లెక్కల ప్రకారం ఈ సీజన్లో లేబర్ పర్సంటేజీ పెంచాలని టార్గెట్పెట్టడం కరెక్ట్ కాదని వాపోతున్నారు. కిందటేడు కరోనా వల్ల ఉపాధి పనులకు డిమాండ్ పెరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ ఈ సీజన్లో పరిస్థితులు అనుకూలంగా లేవని ఫీల్డ్ స్టాఫ్ చెబుతున్నారు.