శబరిమల అయ్యప్ప దర్శనాలపై పరిమితి

శబరిమల అయ్యప్ప దర్శనాలపై పరిమితి

తిరువనంతపురం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల దర్శనాల విషయంలో కేరళ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించే కర్కికాడ ఉత్సవాల నేపథ్యంలో అయ్యప్ప దర్శనాల విషయంలో పరిమితిని విధించాలని శబరిమల ఆలయ ట్రస్టు ట్రావెన్‌కోర్ దేవస్వం నిర్ణయించింది. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో భక్తులను పరిమితి సంఖ్యలో అనుమతించాలని భావించింది. ఈ వేడుకలు పూర్తయ్యే వరకు ప్రతి రోజు 5 నుంచి 10 వేల మంది భక్తులను మాత్రమే రానివ్వనున్నారు. దర్శనాల సమయంలో కొవిడ్ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించేలా చూస్తామని ట్రస్టు తెలిపింది. కర్కిక్కాడ ఫెస్టివల్‌లో భాగంగా శుక్రవారం శబరిమలను తెరిచారు. శనివారం ఉదయం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు.