
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు హాస్పిటళ్లదోపిడీపై ఎట్టకేలకు హెల్త్డిపార్ట్ మెంట్ స్పందించింది. 15జులుగా 800కుపైగా కంప్లయింట్లు వచ్చినా పట్టించుకోని అధికారులు.. మంత్రి కేటీఆర్ ఎంట్రీతో ఒక్క డెక్కన్ హాస్పిటల్ ఘటనపై గురువారం విచారణకు ఆదేశించారు. డెక్కన్ హాస్పిటల్ ఘటనపై బాధితుడు పెట్టిన ట్వీట్‌కు కేటీఆర్ రిప్లైఇచ్చారు. కరోనా టైంలో ప్రైవేట్ హాస్పిటళ్లు ఈ తీరుగా వ్యవహరించడం సిగ్గుచేటు అంటూ కామెంట్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న హాస్పిటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్‌కు ట్విట్టర్లోనే రిక్వెస్ట్ పెట్టారు.వెంటనే స్పందించిన ఈటల..డెక్కన్ హాస్పిటల్ ఘటనపై ఎంకవైరీ్ చేయాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు సూచించారు. 48గంటల్లోనివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
అసలేం జరిగింది?
సత్యనారాయణరెడ్డిఅనే వ్యక్తి ఈ నెల 15న కరోనాతో డెక్కన్ హాస్పిటల్‌లో చేరారు. ఈ నెల 28న ఆయన పరిస్థితి విషమించి చనిపోయారు. అదేరోజు మరో హాస్పిటల్లో ఆయన భార్య కూడా మరణించింది. అంతకుముందు వారం కింద సత్యనారాయణ అన్న కొడుకు సైతం కరోనాతోనే మృతి చెందాడు. అయితే ఈ నెల 15 నుంచి 28 వరకూ సత్యనారాయణకు చేసిన ట్రీట్‌మెంట్‌కు డెక్కన్ హాస్పిటల్ ఏకంగా రూ.17 లక్షల 50 వేల బిల్లు వేసిందని బాధితులు వాపోయారు. అందులో రూ.10 లక్షలు చెల్లించామని, మిగతా సొమ్ము కడితేనే డెడ్బాడీని ఇస్తామని హాస్పిటల్ చెప్పడంతో సత్యనారాయణ కుమారుడు మీడియాను ఆశ్రయించారు. మీడియా కథనాలతో దిగొచ్చిన హాస్పిటల్ మేనేజ్మెంట్.. ఈ నెల 29న డెడ్బాడీని కుటుంబ సభ్యు లకు అప్పగించింది. రూ ల్స్ ప్రకారమే బిల్లులు వేశామని పేర్కొంది. సత్యనారాయణరెడ్డి ట్రీట్‌మెంట్‌కు రూ.12.04 లక్షల బిల్లు వేశామని.. రూ.10 లక్షలు మాత్రమే కట్టారని చెప్పుకొచ్చింది. అయితే తనకు జరిగిన అన్యాయాన్ని సత్యనారాయణ కొడుకు ట్విట్టర్లో పోస్టు చేశారు. అది వైరల్ కావడంతో మంత్రి కేటీఆర్‌స్పందించారు. అయితే సత్యనారాయణరెడ్డి ఘటనపై డెక్కన్ హాస్పిటల్ ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది. ఆయన పరిస్థితి క్షీణించిన స్థితిలో హాస్పిటల్లో చేరారని, ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్ ఇచ్చినా.. ఆయనకు ఉ న్నదీర్ఘ కాలిక వ్యాధుల వల్ల చనిపోయారని పేర్కొంది.
రోజుకు 50 కంప్లైంట్స్
ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్ల దోపిడీపై హెల్త్డిపార్ట్మెంట్ కు పెద్ద సంఖ్యలో కంప్లైంట్లు వస్తున్నాయి. ఈ నెల 15న ప్రారంభించిన వాట్సప్ నం బర్‌కు రోజుకు సగటున 50ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నెల 28 నాటికే 726 కంప్లైంట్స్ రిజిస్టర్ అయ్యాయి. కానీ ఇందులో ఒక్క ఫిర్యాదుపై కూడా హెల్త్డిపార్ట్మెంట్విచారణ ప్రారంభించ లేదు. ఒక్క దవాఖానకు కూడా నోటీసులు పంపలేదు. తాజాగా కేటీఆర్ ఎంట్రీతో డెక్కన్ హాస్పిటల్‌పై మాత్రం విచారణకు ఆదేశించారు. ఎన్ని కంప్లైంట్లు వచ్చినా ఈ టైమ్‌లో ప్రైవేటు హాస్పిటళ్లను ఏమీ చేయలేమని.. ప్రైవేటు మేనేజ్‌మెంట్లు ప్రభుత్వాన్నే ప్రభావితం చేస్తున్నప్పుడు తాము వాటిని ఏం చేయగలమని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. ప్రైవేటు హాస్పిటళ్ల మేనేజ్‌మెంట్లు కూడా ఇదే ధీమాతో పేషెంట్లను అడ్డగోలుగా దోచుకుంటున్నయని పేర్కొన్నారు. అసలు ప్రైవేటు హాస్పిటళ్లు లక్ష నుంచి రూ.5 లక్షల దాకా అడ్వాన్స్ కడితేనే పేషెంట్లను అడ్మిట్ చేసుకుంటున్నాయి. ఏం మందులు ఇస్తున్నరో, ట్రీట్‌మెంట్ ఏం చేస్తున్నరో చెప్పకుంటనే రోజుకు రూ.50 వేల నుంచి లక్షన్నర దాకా కట్టాల ్సిందేనని అంటున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా క్యాష్ కడితేనే ట్రీట్ మెంట్ చేస్తున్నయి. నిజానికి ఇవన్నీ శిక్షించదగ్గనేరాలే. అయితే, ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లయాజమాన్యాలకు ప్రభుత్వ పెద్దలతో ఉన్న దోస్తీతో, వాళ్లజోలికి వెళడానికి ఆరోగ్యశాఖ అధికారులు జంకుతున్నారు.
సర్కారుపై భారం పడ్తదనే!
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నకొద్దీ ప్రైవేట్ హాస్పిటళ్లఅవసరం మరింతగా పెరుగుతోంది. ఇప్పటికే చాలా వరకు కరోనా బాధితులు ప్రైవేటు హాస్పిటళ్ళకే వెళ్తున్నారు. గురువారం ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ప్రస్తుతం ప్రభుత్వ దవాఖాన్లకంటే, ప్రైవేటు హాస్పిటళ్ళ ఎక్కువ మంది చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి 8 గంటల నాటికి ప్రైవేటులో 3,297 మంది పేషెంట్లుఉండగా, ప్రభుత్వ దవాఖాన్లలో 2,188 మందే ఉన్నారు. ప్రభుత్వ దవాఖాన్లలో బెడ్లువేలల్లోఖాళీగా ఉన్నాయని ప్రభుత్వంచెప్తున్నా.. అక్కడికి వెళ్లేందుకు జనం భయపడుతున్నారు. అసలు అంతమంది పేషెంట్లు వస్తేమేనేజ్ చేసేందుకు సరిపడా డాక్టర్లు, నర్సులు, ఇతర స్టాఫ్ లేరు. ఇప్పటికే చాలా హాస్పిటళ్ళ లో పేషెంట్లను డాక్టర్లు, సిబ్బంది పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. పేషెంట్ల సంఖ్య పెరుగుతుండటం, పని ఒత్తిడి ఎక్కువవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని డాక్టర్లు చెప్తున్నారు.