కొత్త జిల్లాల ఆధారంగా వైన్‌ షాపుల రిజర్వేషన్

కొత్త జిల్లాల ఆధారంగా వైన్‌ షాపుల రిజర్వేషన్
  • కొత్త జిల్లా యూనిట్​గా కేటాయింపు
  • ఇయ్యాల కలెక్టర్​ నేతృత్వంలో గుర్తింపు

హైదరాబాద్​, వెలుగు: వైన్​ షాపుల్లో ఎస్సీ, ఎస్టీ, గౌడ్​లకు వైన్స్​లో రిజర్వేషన్లను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గైడ్​ లైన్స్​ను విడుదల చేసింది. డ్రా ద్వారా షాపులకు రిజర్వేషన్లను కేటాయిస్తారు. ఆ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీస్తారు. ఈమేరకు ఆదివారం ఆబ్కారీ శాఖ ఆ గైడ్ ​లైన్స్​ను జారీ చేసింది. కొత్త జిల్లాలు యూనిట్​గా మద్యం షాపులను కేటాయించనున్నారు. కలెక్టర్​ నేతృత్వంలోని నలుగురు సభ్యుల కమిటీ రిజర్వేషన్లను అలాట్​చేస్తుంది. కమిటీలో జిల్లా ఎక్సైజ్​ అధికారి, గిరిజన అభివృద్ధి అధికారి, బీసీ సంక్షేమ శాఖ అధికారి, ఎస్సీ అభివృద్ధి అధికారి సభ్యులుగా ఉంటారు. వైన్​ షాపుల్లో గౌడ్స్​కు 15 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం చొప్పున రిజర్వేషన్లను కేటాయిస్తూ రాష్ట్ర సర్కారు గతంలో ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

రిజర్వేషన్​ ఇట్ల గుర్తిస్తరు..

వైన్​షాపుల రిజర్వేషన్లకు షెడ్యూల్డ్​ ఏరియాల్లో ఎలాంటి డ్రా తీయరు. ఇక్కడ గౌడ్స్​, ఎస్సీలకు అవకాశం ఉండదు. నాన్​ షెడ్యూల్డ్​ ఏరియాల్లో మాత్రం గౌడ్స్​, ఎస్సీలతోపాటు ఎస్టీలకు డ్రా తీస్తారు. జిల్లాల వారీగా డ్రా తీస్తారు. ఒక జిల్లాలో ఉన్న మొత్తం మద్యం దుకాణాలు, వాటి ఏరియాల పేరుతో ఓ డబ్బాలో టోకెన్లు వేస్తారు. ఇందులో మొదటగా ఎస్టీ టోకెన్​ డ్రా తీస్తారు. టోకెన్​ ఏ ఏరియా షాపు పేరు ఉంటుందో దాన్ని ఎస్టీ రిజర్వ్​డ్​గా గుర్తిస్తారు. ఆ తర్వాత వరుసగా ఎస్సీ, గౌడ్స్​ టోకెన్లను డ్రా తీస్తారు. ఇలా వరుసగా రిజర్వేషన్​ సంఖ్య కంప్లీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యేదాకా టోకెన్లు తీస్తూనే ఉంటారు. ఈ ప్రాసెస్​ ప్రకారమే సోమవారం ఎస్సీ, ఎస్టీ, గౌడ్స్​ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. సోమవారం సాయంత్రానికి ఏ ఏరియాలో వైన్​షాపు రిజర్వ్​ అయ్యిందో క్లారిటీ వచ్చే చాన్స్​ ఉంది.