సిద్దిపేట నూతన పోలీస్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన రష్మీ పెరుమాళ్

సిద్దిపేట నూతన పోలీస్  సీపీగా బాధ్యతలు స్వీకరించిన రష్మీ పెరుమాళ్

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్ గా ఎస్. రష్మీ పెరుమాళ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆమె పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించగా అడిషనల్ డీసీపీ సీహెచ్ కుశాల్కర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, గజ్వేల్ ఏసీపీ నరసింహులు, హుస్నాబాద్ ఏసీపి సదానందం, ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ సీపీని మర్యాదపూర్వకంగా కలసి మొక్కలను అందజేశారు. 

సీపీ ఆఫీస్ లో ఉన్న అన్ని విభాగాలను సందర్శించి పోలీస్ అధికారులతో ఇంట్రాక్టివ్ సెషన్ నిర్వహించిన సీపీ పలు సూచనలు చేశారు. అందరూ కలిసి టీం వర్క్ చేయాలని,  ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం కలెక్టరేట్ లో కలెక్టర్ హైమావతిని మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జిల్లాలో శాంతి భద్రతలు, స్థానిక ఎన్నికల నిర్వహణపై కాసేపు చర్చించారు.