న్యూ ఇయర్ ​సెలబ్రేషన్స్​తో హోరెత్తిపోయిన గ్రేటర్ సిటీ

న్యూ ఇయర్ ​సెలబ్రేషన్స్​తో హోరెత్తిపోయిన గ్రేటర్ సిటీ

న్యూ ఇయర్ ​సెలబ్రేషన్స్​తో గ్రేటర్ సిటీ హోరెత్తిపోయింది. నగరవాసులంతా కొత్త ఏడాదికి గ్రాండ్​గా వెల్ కమ్ చెప్పారు. శనివారం అర్ధరాత్రి వరకు గ్రేటర్ వ్యాప్తంగా పలు ప్రాంతాలు.. జనాల కేరింతలు, వేడుకలతో సందడిగా కనిపించాయి. ఇయర్‌‌‌‌‌‌‌‌ ఎండ్​కు వీకెండ్ కూడా కలిసి రావడంతో జనాలంతా ఉదయం నుంచే సెలబ్రేషన్స్ మొదలుపెట్టేశారు. దీంతో సిటీలోని టూరిజం స్పాట్‌‌‌‌లు, మల్టీప్లెక్స్‌‌‌‌లు, మాల్స్, మార్కెట్లలో సందడి నెలకొంది.  సిటీలోని లవ్‌‌‌‌ హైదరాబాద్, ట్యాంక్‌‌‌‌బండ్, నెక్లెస్ రోడ్, దుర్గం చెరువు, మల్కం చెరువు, కేపీహెచ్‌‌‌‌బీ ఐడీఎల్‌‌‌‌ లేక్, చార్మినార్‌‌‌‌‌‌‌‌, కేబుల్‌‌‌‌ బ్రిడ్జి, ఖాజాగూడ లేక్, ఇలా టూరిస్ట్ ప్లేసెస్ లో సాయంత్రం వరకు స్టూడెంట్లు, ఫ్యామిలీల రద్దీ కనిపించింది.  

గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, హోటల్ నోవాటెల్, తాజ్ డెక్కన్, బంజారాహిల్స్, వండర్‌‌‌‌‌‌‌‌లా, సిటీ శివార్లలోని రిసార్ట్‌‌‌‌లు, కన్వెన్షన్ సెంటర్లు తదితర ప్రాంతాల్లో న్యూ ఇయర్ ఈవెంట్లు జోష్‌‌‌‌ ఫుల్​గా జరిగాయి. గచ్చిబౌలి స్టేడియంలో న్యూ ఇయర్ నో పాజ్ పార్టీ, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో థండర్ స్ట్రైక్స్ న్యూ ఇయర్ బాష్, ఓం కన్వెన్షన్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో ఫేమస్ డీజే దర్శన్ రావ్ ఎన్‌‌‌‌వైఈ –2023 పేర్లతో రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సెలబ్రేషన్స్ నిర్వహించారు.  గచ్చిబౌలిలోని హోటల్ షెరటాన్​లో క్వీన్స్ లాంజ్ క్లబ్ మెంబర్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ఉత్సాహంగా జరుపుకొన్నారు. డ్యాన్స్, ఫ్యాషన్, మ్యాజిక్ షోలు, ఫొటో బూత్​లు  ఆకట్టుకున్నాయి.  సోషల్ మీడియాలో ఫేమ్ అయిన వ్యక్తులు, బిగ్‌‌‌‌బాస్ సెలబ్రిటీలతోపాటు రామ్ మిరియాల లాంటి ప్లే బ్యాక్ సింగర్ల ఆటపాటలతో సెలబ్రేషన్స్ మరింత కలర్ ఫుల్ గా మారాయి.    

- వెలుగు, హైదరాబాద్