ఖరీదైన వస్తువులు కొని కస్టమర్ల కష్టాలు!

ఖరీదైన వస్తువులు కొని కస్టమర్ల కష్టాలు!
  • అమ్మేసి...ఆనక మొహం చాటేస్తున్న కంపెనీలు
  • అవస్థలపాలవుతున్న కన్జూమర్లు

వెలుగు బిజినెస్ డెస్క్​: ఎంతో ఇష్టపడి కొనుక్కుంటున్న ఖరీదైన వస్తువులు సరిగా పనిచేయకపోతే...చాలా కష్టంగా అనిపిస్తుంది కదూ! మన దేశంలో ఇలా ఖరీదైన వస్తువులు కొనుక్కుని అవి సరిగా పనిచేయనప్పుడు ఇబ్బందులెదుర్కొంటున్న కస్టమర్ల సంఖ్యకు కొదవేలేదని ఒక సర్వేలో తేలింది. ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ మార్కెట్లలో ఖరీదైన వస్తువులు కొనడం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో కస్టమర్ల అనుభవాలపై లోకల్​ సర్కిల్స్​ ఒక సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్టులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఖరీదైన వస్తువులు కొన్నాక వాటిలో ఏవైనా లోపాలుంటే కస్టమర్లకు సరయిన పరిష్కారం దొరకడం లేదని ఈ సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న ప్రతీ ఇద్దరిలో ఒకరు ఇలాంటి ప్రోబ్లమ్​ ఫేస్​ చేస్తున్నారంటే పరిస్థితి ఈజీగానే అర్థమవుతుంది. కన్జూమర్ల అనుభవాలు తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించినట్లు లోకల్​ సర్కిల్స్​ తెలిపింది. కొన్న ఖరీదైన ప్రొడక్టులలో లోపాలుంటే, రీప్లేస్​మెంట్​ కోసం కన్జూమర్లు చాలా అవస్థలు పడుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. దేశంలోని 355 చోట్ల నుంచి  28 వేల మంది కన్జూమర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో 63 శాతం మంది మగవారని, 37 శాతం మంది మహిళలనీ లోకల్​ సర్కిల్స్​ తెలిపింది. తాము కొన్న  హై వాల్యూ ఐటమ్స్​లో కనీసం ఒక్కటైనా డిఫెక్టివ్​ వస్తువు ఉందని 46 శాతం మంది సర్వేలో చెప్పారు. ఫాల్టీ లేదా డిఫెక్టివ్​ ప్రొడక్ట్​ కొన్న తర్వాత ఆయా బ్రాండ్​ల నుంచి ఎలాంటి సపోర్టూ లభించలేదని ప్రతి పది మందిలో ముగ్గురు వెల్లడించారు. అయితే ప్రోబ్లమ్​ సొల్యూషన్​ కోసం  అసలు ఆ బ్రాండ్​నే కోరలేదని పది మందిలో ఒకరు చెప్పారు. కొన్న ఖరీదైన వస్తువులలో ఒక్కటైనా డిఫెక్టివ్​ ఉందని ప్రతీ ఇద్దరు కన్జూమర్లలో ఒకరు పేర్కొన్నారు.

ఆఫ్టర్​ సేల్స్ సర్వీసు​, రీప్లేస్​మెంట్​ కష్టమే....
మన దేశంలో ఆఫ్టర్​ సేల్స్​ సర్వీస్​ లేదా ఫాల్టీ ప్రొడక్ట్​ రీప్లేస్​మెంట్​ పొందడం చాలా కష్టమైనదేనని తమ సర్వేలో తేలినట్లు లోకల్​ సర్కిల్స్​ వెల్లడించింది. ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి కన్జూమర్లు చాలా కాలమే వెయిట్​ చేయాల్సి వస్తోందని పేర్కొంది. అప్లయెన్సెస్​, ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్లు సరిగా పనిచేయడం లేదనే కంప్లయింట్లు  కన్జూమర్ల నుంచి రెగ్యులర్​గా వస్తున్నాయని లోకల్​ సర్కిల్స్​ తెలిపింది. ప్రొడక్టుపై వారంటీ ఉన్నా సరే, రీప్లేస్​మెంట్​ ఇవ్వకుండా ఉండటానికి ఎలాంటి స్థాయికైనా వెళ్లడానికి కంపెనీలు సిద్ధపడుతున్నాయని పేర్కొంది.

కంపెనీలపై యాక్షన్​ తీసుకోవాల్సిందే.....
ఆఫ్టర్​ సేల్స్​ సర్వీసు మన దేశంలో అధ్వాన్నంగా ఉంటోందని చాలా మంది కన్జూమర్లు లోకల్​ సర్కిల్స్​కు తెలిపారు. ఈ నేపథ్యంలో డిఫెక్టివ్​ ప్రొడక్టులు అమ్ముతున్నట్లు తేలిన కంపెనీలపై సెంట్రల్​ కన్జూమర్​ ప్రొటెక్షన్​ అథారిటీ (సీసీపీఏ) సూమోటోగా చర్యలు తీసుకోవాలని కన్జూమర్లు కోరుతున్నట్లు లోకల్​ సర్కిల్స్​ వెల్లడించింది. 94 శాతం మంది కన్జూమర్లు ఈ ప్రపోజల్​కు మద్దతు ఇస్తున్నట్లు పేర్కొంది. ఆటోమొబైల్స్​, గాడ్జెట్లు, వైట్​ గూడ్స్​, కన్జూమర్​ ఎలక్ట్రానిక్స్​, అప్లయెన్సెస్​ వంటి హై వాల్యూ ప్రొడక్ట్​ల ఆఫ్టర్​ సేల్స్​ సర్వీసుపై లోకల్​ సర్కిల్స్​ ఈ స్టడీ నిర్వహించింది.