ఐపీఎల్ 2022లో సిక్సర్ల వీరులు

ఐపీఎల్ 2022లో సిక్సర్ల వీరులు

క్రికెట్ క్రేజీ టోర్నీ ఐపీఎల్లో పరుగుల వరద పారిస్తే ఫ్యాన్స్కు పండగే. బౌలర్లు వికెట్లు తీసుకున్నప్పుడు ఫ్యాన్స్ పొందే అనందం కంటే..బ్యాట్సమన్ ఫోర్లు, సిక్సులు పొందే సంతోషమే వేరు. ముఖ్యంగా  బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కొట్టే సిక్సర్ల మజానే వేరు. తాజా ఐపీఎల్లోనూ బ్యాట్సమన్ కొట్టిన చెక్కా..చుక్కలను తాకాయి. బౌలర్ ఎవరన్నది ముఖ్యం కాదు..బంతి స్టాండ్లోకి వెళ్లిందా ముఖ్యం అన్న విధంగా బ్యాట్సమన్  సిక్సర్లతో చెలరేగారు. 

ఈ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్  అత్యధిక సిక్సులు బాదిన జాబితాలో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాడు. ఇప్పటి వరకు 13 మ్యాచులు ఆడిన బట్లర్..బౌలర్లను ఊచకోత కోస్తూ..37 సిక్సర్లను దంచికొట్టాడు. ఈ ఐపీఎల్లో అతను సూపర్ ఫాంలో ఉన్నాడు. ఏకంగా మూడు సెంచరీలతో చెలరేగాడు. రాజస్థాన్ ప్లేఆఫ్కు చేరుకోవడంలో బట్లర్ పాత్ర కీలకం. 

అండ్రూ రస్సెల్ ..నీళ్లు తాగినంత ఈజీగా సిక్సులు కొట్టగల సమర్థుడు. ఈ వెస్టిండీస్ హిట్టర్..క్రీజులో ఉంటే బౌలర్లకు చుక్కలే. IPL 2022లో కోల్కతా తరపున బరిలోకి దిగిన రసెల్..14 మ్యాచుల్లో 32 సిక్సర్లతో రెచ్చిపోయాడు. మొత్తంగా ఐపీఎల్ హిస్టరీలో అతను 175 సిక్సులు బాదడం విశేషం. 


  
సిక్సుల వీరుల లిస్టులో పంజాబ్ కింగ్స్ కింగ్ లివింగ్ స్టోన్ మూడో  స్థానంలో ఉన్నాడు.  13 మ్యాచుల్లో పంజాబ్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించిన లివింగ్ స్టోన్..29 సిక్సర్లు కొట్టాడు. ఈ సీజన్లో అత్యధిక మీటర్ల సిక్స్ లివింగ్ స్టోనే బాదడం విశేషం. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో డివై పాటిల్ స్టేడయంలో  లివింగ్ స్టోన్ 117 మీటర్ల సిక్స్ కొట్టాడు. ఇది ఐపీఎల్ 2022లోనే హైలెట్ సిక్స్.

సంప్రదాయంగా సిక్సులు కొట్టడంలో కేఎల్ రాహుల్ సిద్దహస్తుడు. బంతిని బలంగా బాదినట్లు అనిపించదు కానీ బాల్ను చూస్తే మాత్రం స్టాండ్లో ఉంటుంది. ఈ సీజన్లో కెప్టెన్గా, బ్యాట్సమన్గా అదరగొడుతున్న కేఎల్ రాహల్..ఇప్పటి వరకు 14 మ్యాచుల్లో 25 సిక్సర్లు కొట్టాడు. అంతేకాదు రెండు సూపర్ సెంచరీలు నమోదు చేయడం విశేషం. 

 సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్..లక్నో సూపర్ జెయింట్స్ లక్కీ ఓపెనర్ క్వింటన్ డికాక్ సిక్స్ బాదితే ఆ కిక్కే వేరు. సిక్సులు కొట్టడంలో ఎడమచేతి వాటం బ్యాట్సమన్ స్టైలే వేరుంటుంది. ముఖ్యంగా కోల్కతాతో వాంఖడేలో జరిగిన మ్యాచ్లో డికాక్ దంచిన సిక్స్లు అద్భుతం. ఇప్పటి వరకు 14 మ్యాచుల్లో 22 సిక్సర్లు సంధించాడు. 

కోల్కతా నైటర్ రైడర్స్ మిడిలార్డర్ బ్యాట్స్మన్ నితీష్ రాణాకు బౌలర్ ఎవరన్నది ముఖ్యం కాదు..బంతిని స్టాండ్లోకి తరలించామన్నది ముఖ్య అన్న విధంగా ఆడతాడు.  ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ అయిన నితిష్ రాణాకు..రిథమిక్గా సిక్స కొట్టడం అలవాటు. అందుకే ఐపీఎల్ 2022లోనూ సిక్స్ల వీరుడిగా పేరు తెచ్చుకున్నాడు. 14 గేముల్లో 22 సిక్సర్లతో 6వ ప్లేస్లో నిలిచాడు.  ఓవరాల్ ఐపీఎల్ కెరియర్లో నితిష్ రాణా 111 సిక్సులు బాదడం గమనార్హం. 

వీరితో పాటు..రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్, హెట్ మెయర్, సన్ రైజర్స్ హైదరాబాద్ హిట్టర్ నికోలస్ పూరన్..ఈ ఐపీఎల్లో 21 సిక్స్లు చొప్పున బాదారు. శాంసన్ 13 మ్యాచుల్లో 21 కొట్టగా..ఓవరాల్గా ఐపీఎల్ కెరియర్లో 153 చెక్కాలు దించికొట్టాడు. అటు హెట్ మెయర్ 11 మ్యాచుల్లో 21 సిక్స్లు సంధించాడు. హైదరాబాద్ ఆటగాడు నికోలస్ పూరన్..13 మ్యాచుల్లో 21 సిక్సులతో రాణించాడు.