కమలంలో వీడని ఉత్కంఠ..హైదరాబాద్ నుంచి 9 మంది అభ్యర్థులు

కమలంలో వీడని ఉత్కంఠ..హైదరాబాద్ నుంచి 9 మంది అభ్యర్థులు

    బీజేపీ మూడో జాబితాలో గ్రేటర్​ నుంచి 9 మంది ఖరారు
    ఇంకా కీలక స్థానాల్లో ప్రకటించని హైకమాండ్

హైదరాబాద్, వెలుగు :  బీజేపీ మూడో జాబితాలో సిటీ నుంచి 9 మంది అభ్యర్థులను ప్రకటించింది.  కొన్ని ముఖ్యమైన స్థానాల్లో ఇంకా ఖరారు చేయకపోవడంతో టికెట్లను ఆశిస్తున్న నేతల్లో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్​, కాంగ్రెస్ ​తమ అభ్యర్థులను ప్రకటించగా ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ ఆశావహుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారా? ప్రచారాన్ని ఎప్పుడు చేసుకోవాలా? అనే ఆతృత ఆశావహు ల్లో ఉంది.

బీజేపీ అధిష్టానం గురువారం 35 మందితో మూడో జాబితా ప్రకటించింది. ఇందులో సిటీలో 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా.. ఆయా  చోట్ల  సస్పెన్స్​కు తెర పడింది. శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, కూకట్​పల్లి , సికింద్రాబాద్​, కంటోన్మెంట్​ సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రకటించకపోవడంతో  ఆ పార్టీ నేతల్లో అయోమయం నెలకొంది.

రంగారెడ్డి జిల్లాలో ఇలా..

షాద్ నగర్/చేవెళ్ల : రంగారెడ్డి జిల్లాలో షాద్ నగర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీనియర్ నేత ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబాయ్యకు అవకాశం కల్పించారు. పార్టీ నుంచి టికెట్ ఆశించిన నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డిలకు భంగపాటు ఎదురైంది. చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కేఎస్​రత్నంకు కేటాయించారు. కొద్దిరోజుల కిందట ఆయన బీజేపీలో చేరగా.. మూడో జాబితాలోనే ఆయన పేరు ప్రకటించారు. బీఆర్ఎస్​ టికెట్​ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ మారారు.