ధరణిలో ఆస్తుల నమోదుపై వివరణ ఇవ్వండి

ధరణిలో ఆస్తుల నమోదుపై వివరణ ఇవ్వండి

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ లో ప్రజల ఆస్తుల నమోదుకు చట్టబద్ధత లేదంటూ దాఖలైన పిటిషన్ పై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జీఆర్ కరుణాకర్ ఇతరులు వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై జస్టిస్ షమీమ్ అక్తర్ శనివారం విచారణ చేపట్టారు . పిటిషనర్ తరపు లాయర్ శశికిరణ్ వాదిస్తూ.. ప్రజలఆస్తుల వివరాలను సేకరించి వెబ్‌ పోర్టల్‌‌లో పెట్టే విధానాన్ని తప్పుపట్టారు . ఆదాయ పన్నుచట్టం కింద పాన్‌‌ కార్డు, వాహన చట్టం కింద డ్రైవింగ్‌ లైసెన్స్, ఆధార్‌‌ చట్టం కిం ద ఆధార్‌‌ ఉన్నాయని, ప్రజల ఆస్తులను ధరణి వెబ్‌ పోర్టల్‌‌లో నమోదుకు ఏ చట్టం ఉందో ప్రభుత్వం చెప్పడం లేదన్నారు . చట్ట వ్యతిరేకంగా ఒక వెబ్‌ పోర్టల్‌‌ పెట్టి ప్రజల ఆస్తుల వివరాలను అందులో నమోదు చేస్తే అవన్నీ గోప్యంగా ఎలా ఉంటాయన్నారు . ప్రభుత్వ స్పందన తెలుసుకుని చెప్పాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కు సూచించింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.