మేమేం చేయాల్నో మీరే చెప్పండి..రాష్ట్ర సర్కార్ పై హైకోర్టు ఫైర్

మేమేం చేయాల్నో మీరే చెప్పండి..రాష్ట్ర సర్కార్ పై హైకోర్టు ఫైర్
  • ప్రజారోగ్యం కోసం ఇచ్చినఆదేశాలనూఅమలుచేయరా?
  • మార్చినట్టు చెప్పిన హెల్త్ బులిటెన్లోనూ అరకొర వివరాలే..
  • కరోనా పేషెంట్ల వివరాలు చెప్పడంలో ఉన్న ఇబ్బందేంటి?
  • ప్రైవేటు హాస్పిటళ్లలో అడ్డగోలు చార్జీలపై చర్యలు ఏవి?
  • అసలు మేం ఏం చెయ్యాల్నో సీఎస్నుఅడిగి తెలుసుకుంటం
  • నేడు సీఎస్ స్వయంగా విచారణకు రావాలె..
  • హెల్త్సెక్రటరీ, ఇతరఉన్నతాధికారులూ రావాలని ఆదేశం
ప్రైవేట్‌ హాస్పిటళ్ల దోపిడీని ఎందుకు అడ్డు కోవడం లేదు. వివిధ టెస్టులు చేసేందుకు సర్కారు నిర్ణయించిన ఫీజులు, ప్రైవేట్‌ హాస్పిటళ్ల వసూళ్లపై పర్యవేక్షణ ఏది? అడ్డగోలు చార్జీల వసూళ్లపై అధికారులు తీసుకున్న చర్యలేమిటోతెలియడం లేదు. మేం ఇచ్చే ఆదేశాలపై చెవిటివాళ్ల ముందు శంఖం పూరించినట్లుగా అధికారుల తీరు ఉంటే ఎట్లా?- హైకోర్ట్

హైదరాబాద్, వెలుగు: కరోనా టెస్టులు, ట్రీట్మెంట్ , బులెటిన్లపై, ప్రైవే ట్ హాస్పిటల్స్ లో చార్జీలకు  సంబంధించి దాఖలైన పిల్స్ లో   తాము ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర సర్కారు ఎందుకు అమలు చేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. మరి హైకోర్టు ఏం చేయాలో, ఎలా వ్యవహరించాలో రాష్ట్ర సర్కారే చెప్పాలని ఘాటుగా నిలదీసింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు ఇచ్చిన ఆదేశాలే అమలు కావడంలేదంటే ఏమనుకోవాలని, కోర్టులంటే లెక్కలేదా అని, ఇది దురదృష్టకరమని మండిపడింది. జనం మంచికోసం, జనం ఆరోగ్యం కోసం తాము ఇస్తున్న ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసింది. అసలు తామేం చేయాలో చీఫ్ సెక్రెటరీని అడుగుతామని.. సీఎస్, హెల్త్ ప్రి న్సిపల్ సెక్రెటరీ, ఇతర ఉన్నతాధికారులు మంగళవారం హైకోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. హెల్త్ బులెటిన్ డిటెయిల్డ్గ్ గా ఉండాలని చెప్పామని..మార్చామంటూ సర్కారు విడుదల చేసిన బులెటిన్ కూడా  అరకొరగా ఉందని స్పష్టం చేసింది. ఇది దురదృష్టానికి పరాకాష్ట అని కామెంట్ చేసింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. రాష్ట్రంలో కరోనా టెస్టులు సరిగా చేయడం లేదని,బెడ్స్‌ లేవని, పీపీఈ కిట్లు తగినన్ని సరఫరా కావడం లేదని, బెడ్స్‌ ఖాళీల గురించి డ్యాష్‌బోర్డులు పెట్టాలని.. ఇలా పలు అభ్యరనలతో  దాఖలైన పది పిల్స్‌ పై చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డిలతో కూడిన డివిజన్‌బెంచ్‌ సోమవారం విచారణ కొనసాగించింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేయడంలో సర్కారు నిరక్ష్ల్ యం చూపుతోందని మండిపడింది. జూన్‌ 8 నుంచి విచారణ జరిగినప్పుడల్లా తాము ఆదేశాలు ఇస్తూనే ఉన్నామని, కానీ పాలకులు ఏమీ పట్టనట్టుఎందుకు ఉంటున్నారని నిలదీసింది. సర్కారు తమ ఆదేశాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని, జూన్‌ 8 నుంచి తామిచ్చిన ఒక్క ఉత్తర్వును కూడా అధికారులు అమలు చేయలేదేమని ప్రశ్నించింది. ‘‘హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం కష్టంగా ఉందా? నిజంగానే కష్టం ఏమైనా ఉంటే చెప్పండి. ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేరో చెప్పండి. హెల్త్‌ బులిటెన్స్‌ వివరంగా ఉండాలని పదేపదే చెప్పినా ఫలితం లేకపోయింది. చివరికి నిన్నటి హెల్త్‌ బులిటెన్‌లో కూడా హైకోర్టు చెప్పినట్టు కాకుండా.. అరకొరగా వివరాలు ఉన్నాయి. ఇది దురదృష్టకరానికి పరాకాష్ట” అని ఘాటుగా కామెంట్ చేసింది. మరి హైకోర్టు ఏం చేయాలో సర్కారే చెప్పాలని మండిపడింది. మంగ ళవారం (28న) జరిగే విచారణకు చీఫ్‌సెక్రటరీ (సీఎస్‌) స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని.. ప్రభుత్వం ఎందుకు హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయడం లేదో సీఎస్‌నే ప్రశ్నించి తెలుసుకుంటామని స్పష్టం చేసింది. సీఎస్‌తోపాటు మెడికల్‌ అండ్‌ హెల్త్, మున్సి పల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రిన్సి పల్‌ సెక్రెటరీలు, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టరేట్  శ్రీనివాసరావు, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్ రమేష్‌రెడ్డి తదితరులు కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
పేషెంట్ల డీటెల్స్ చెప్తే ఏమవుతుంది?

వివిధ హా స్పిటళ్లలో కరోనా పేషెంట్ల వివరాలను తెలిపే వెబ్‌లింక్‌ ఇవ్వడానికి సర్కారుకు ఉన్న సమస్య ఏమిటని రాష్ట్ర సర్కారును హైకోర్టు ప్రశ్నించింది. బెడ్స్‌ ఖాళీల గురించి ఆయా హాస్పిటళ్ల దగ్గ ర లైవ్‌ డ్యాష్‌ బోర్డులు ఏర్పాటు చేయడం, వాటి గురించి వెబ్‌ లింక్‌లోనూ ఉండేలా చేయడం వల్ల కరోనా బాధితులకు సౌకర్యంగా ఉంటుందని చెప్పినా ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీసింది. కరోనా ట్రీట్మెంట్ చేసే హాస్పిటళ్ల గురించి వెబ్‌ లింక్‌ సౌకర్యం అందు బాటులోకి తెచ్చి బాధితులకు సమాచారం ఈజీగా అందేలా చేయడంలో సర్కారుకు ఉన్నకష్టం ఏమిటని ప్రశ్నించింది. రాష్ట్ర సర్కారు రోజూ విడుదల చేసే హెల్త్‌ బులిటెన్‌ లో జిల్లాల వారీగా, హాస్పిటళ్ల వారీగా సమాచారం ఉంటే..ఆయా ప్రాంతాల వారికి పూర్తి వివరాలు తెలియజేసినట్లు అవుతుందని తెలిపింది. పాజిటివ్‌ వచ్చిన వాళ్ల గురించి వయసుల వారీగా బులిటెన్‌లో ఉండేలా చేసేందుకు ఉన్న కష్టం ఏముందని పేర్కొంది. కంటెయిన్మెంట్ జోన్ల గురించి ప్రకటించాలని ఆదేశించినా అమలు కాలేదని పేర్కొంది.
‘ప్రైవేటు’పై నియంత్రణ ఏదీ?
ప్రైవేట్‌ హాస్పిటళ్లలో  వసూలు చేస్తున్న చార్జీలు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలించి ,సరిగా లేకపోతే చర్యలు తీసుకునేందుకు సర్కారు యంత్రాంగం ఎందుకు కదలడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ‘‘వివిధ టెస్టులు చేసేందుకు సర్కారు నిర్ణయించిన ఫీజులు, ప్రైవేట్‌ హాస్పిటళ్ల వసూళ్ళ పై  పర్యవేక్షణ చేసి.. దోపిడీని ఎందుకు అడ్డుకోవట్లేదు. ప్రైవేట్‌ హాస్పిటళ్ళ లో అడ్డగోలు చార్జీల ర్జీ వసూళ్లపై అధికారులు తీసుకున్న చర్యలేమిటో తెలియట్లేదు. మేం ఇచ్చే ఆదేశాలపై చెవిటి వాళ్లముందు శంఖం పూరించినట్లుగా అధికారుల తీరు ఉంటే ఎట్లా?” అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం విచారణకు సీఎస్, ఇతర అధికారులురా వాలంటూ విచారణను వాయిదా వేసింది.