పోక్సో కేసులో నిందితుడికి ఐదేండ్ల జైలు

పోక్సో కేసులో నిందితుడికి ఐదేండ్ల జైలు

కామారెడ్డి, వెలుగు : పోక్సో కేసులో నిందితుడికి ఐదేండ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ  జిల్లా న్యాయమూర్తి సీహెచ్ వీఆర్ఆర్ వర ప్రసాద్ తీర్పునిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి..  2022 సెప్టెంబర్ 18న స్కూల్‌కు సెలవు ఉండగా ఫత్లాపూర్​ గ్రామానికి చెందిన బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే గ్రామానికి చెందిన నిందితుడు యగు జల్దేవార్ శ్రీనివాస్ బాలిక ఇంట్లోకి  వెళ్లి  లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో నానమ్మ వచ్చి తలపులు గట్టిగా కొట్టింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి నిందితుడు పారిపోయాడు. 

 తల్లిదండ్రులు వ్యవసాయ పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి రాగా, బాలిక విషయాన్ని చెప్పింది. దీంతో 2022 సెప్టెంబర్ 19న బిచ్కుంద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, జల్దేవార్ శ్రీనివాస్​ను అరెస్ట్​ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సాక్ష్యాలను పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి సీహెచ్​.వీఆర్​ఆర్​ వర ప్రసాద్ ఐదేండ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. అప్పటి బిచ్కుంద ఎస్​హెచ్​వో కె. శ్రీధర్ రెడ్డి, పోలీస్ తరఫున వాదనలు వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శేషు, కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టిన ప్రస్తుత ఎస్​హెచ్​వో ఏ. మోహన్ రెడ్డి , కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఏఎస్సై రామేశ్వర్ రెడ్డి, కోర్ట్ కానిస్టేబుల్ కె, శ్రీకాంత్ లను  ఎస్పీ అభినందించారు.