- కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ పట్టణంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి కంచె ఏర్పాటు చేయాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. గురువారం మున్సిపల్ కార్పొరేషన్ సమస్యలపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రకృతి వనాలను పెంచాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. ప్రతి రోజు ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించి తడి, పొడి చెత్తను వేరు చేయాలన్నారు. డ్రైనేజీ పూడికతీతకు జేసీబీలు వాడాలని, స్వీపింగ్ వెహికల్ రిపేర్లు చేయించి వాడకంలోకి తేవాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్లను 400 చదరపు అడుగుల్లో నిర్మించుకోవచ్చని, లబ్ధిదారులు వినియోగించుకోవాలన్నారు. అడిషనల్కలెక్టర్ అంకిత్, నగర పాలక కమిషనర్ దిలీప్‌కుమార్, హౌసింగ్ డీఈ నివర్తి, డిప్యూటీ కమిషనర్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.
స్కూల్బ్యాగులపై ఫోకస్
మోయలేని స్థితిలో స్కూల్‌బ్యాగులు ఉండకుండా చూడాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం విద్యాశాఖ ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్‌లో కలెక్టర్ మాట్లాడారు. బహుళ అంతస్తులు ఉన్న స్కూల్ భవనాల్లో మెట్లకు రెయిలింగ్ ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో యూడైస్‌లో వివరాల నమోదు రెండు రోజుల్లో ముగించాలని ఆదేశించారు. ఫేసియల్ అటెండ్స్ తప్పనిసరి అని తెలిపారు. ట్రైనీ కలెక్టర్ కరోలిన్, డీఐఈవో రవికుమార్, డీఈవో అశోక్, ఎంఈవోలు పాల్గొన్నారు.
