ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు : జి.నవిత

ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు : జి.నవిత

నిజామాబాద్, వెలుగు: భీంగల్, కమ్మర్ పల్లి మండల కేంద్రాల్లోని దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లను గురువారం జిల్లా ఫుడ్​ సేఫ్టీ అధికారిణి జి.నవిత తనిఖీ చేశారు.  కారా బూందీ తయారు చేస్తున్న యూనిట్లు, కిరాణా సూపర్ మార్కెట్లలోని ఫుడ్​ ఐటమ్స్, రెస్టారెంట్లలోని ఆహార పదార్థాలను పరిశీలించారు.  లైసెన్స్ లేని షాపులతోపాటు శుభ్రత పాటించని దుకాణాల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఆమె వెంట అధికారిణి టి.సునీత ఉన్నారు.