యువత క్రీడల్లో రాణించాలి : ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి

 యువత క్రీడల్లో రాణించాలి : ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి
  • ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి

ఆర్మూర్, వెలుగు :  యువత క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి అన్నారు. గురువారం ఆర్మూర్​లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలో నిర్వహించిన 11వ జోనల్ లెవెల్ గేమ్స్, స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా స్పోర్ట్స్​ డ్రెస్​ లను పంపిణీ చేసి మాట్లాడారు. ఆధునిక కాలంలో చిన్నారులు ఆటలకు దూరమవుతున్నారని, తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించాలన్నారు.  

అనంతరం ఆలూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆలూర్​, నందిపేట్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను అందజేశారు.  కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ, ఆలూరు, బీజేపీ మండలాల అధ్యక్షులు మందుల బాలు, శ్రీకాంత్, పటేల్ రాజు పాల్గొన్నారు.