బార్లు, పబ్ లు, థియేటర్లపై ఆంక్షలేవి.?

బార్లు, పబ్ లు, థియేటర్లపై ఆంక్షలేవి.?

రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డిలతో కూడిన ఇద్దరు సభ్యుల బెంచ్ విచారించింది. ప్రభుత్వ లెక్కలు కోర్టును తప్పు దోవ పట్టించేలా ఉన్నాయని చెప్పింది. పది శాతం కంటే తక్కువగా టెస్టులు చేస్తున్నారని, అది ఆమోదయోగ్యం కాదని చెప్పింది. పెళ్లిళ్లు, అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలపై ఆంక్షలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. వ్యాక్సినేషన్ ను 24 గంటలు ఎందుకు కొనసాగించలేకపోతున్నారని అడిగింది. కరోనా పరిస్థితులపై వెంటనే స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.