ఈ నెల 15 వరకు శివానందరెడ్డిని అరెస్ట్‌‌ చేయొద్దు .. ఆదేశించిన హైకోర్టు

ఈ నెల 15 వరకు శివానందరెడ్డిని అరెస్ట్‌‌ చేయొద్దు .. ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా బుద్వేలులోని 26 ఎకరాలను నకిలీ పత్రాలతో అమ్మారంటూ సీసీఎస్‌‌ పోలీసులు పెట్టిన కేసులో ఏపీ టీడీపీ నేత శివానందరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. శివానందరెడ్డితో సహా అతడి భార్య ఉమాదేవి, కొడుకు కనిష్కను ఈ నెల 15 వరకు అరెస్టు చేయొద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. 

కేసు దర్యాప్తును కొనసాగించొచ్చని స్పష్టం చేసింది. నిందితులకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణ చేయొచ్చని జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి సోమవారం ఆదేశాలిచ్చారు. 2022లో నమోదైన మూడు కేసుల్లో భాగంగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.