సాదాబైనామాల రెగ్యులరైజేషన్ ఆపండి

సాదాబైనామాల రెగ్యులరైజేషన్ ఆపండి

కొత్త రెవెన్యూ చట్టం వచ్చాక అందిన సాదాబైనామాల దరఖాస్తులు పరిశీలించవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. సాదాబైనామాలు రద్దయినప్పుడు దాని ప్రకారం భూములను ఏవిధంగా రెగ్యులరైజ్ చేస్తారో చెప్పాలని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల గడువు కోరారు అడ్వకేట్ జనరల్. దీంతో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కొత్త దరఖాస్తులు పరిశీలించవద్దని ఆదేశించింది హైకోర్టు.

సాదాబైనామాల విచారణ సందర్భంగా కొత్త రెవెన్యూ చట్టం అక్టోబర్ 29 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు అడ్వకేట్ జనరల్. అక్టోబర్ 10 నుంచి 29 వరకు 2 లక్షల 26 వేల 693 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అక్టోబర్ 29 నుంచి నిన్నటి వరకు 6 లక్షల 74 వేల 201 దరఖాస్తులు అందాయని చెప్పారు. అయితే తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కొత్త చట్టం అమల్లోకి వచ్చాక అందిన దరఖాస్తులు పరిశీలించవద్దని ఆదేశించింది హైకోర్టు. 2 లక్షల 26 వేల 693 దరఖాస్తులపై నిర్ణయం కూడా తుది తీర్పుకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. సాదాబైనామాలపై నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు హైకోర్టు ను ఆశ్రయించాడు.