ఇయ్యాల పలు జిల్లాల్లో భారీ వర్షాలు

ఇయ్యాల పలు జిల్లాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.