
సిరిసిల్ల, వెలుగు: స్టూండెంట్స్ చేత బెంచీలు మోయించిన సంఘటన శుక్రవారం జిల్లా కేంద్రంలోని చిన్ని బోనాల గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ లో జరిగింది. శనివారం గ్రూప్– 4 ఎగ్జామ్ కు చిన్న బోనాల గురుకుల స్కూల్ లో సెంటర్ కేటాయించారు. దీంతో విద్యార్థులతో బెంచీలు వేయించారు. స్టూండెంట్స్ చేస్తున్న పనులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అటెండర్లు చేయాల్సిన పనులను స్టూండెంట్స్ తో చేయించడంతో ప్రిన్సిపాల్ పై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.