కాజల్ అగర్వాల్ ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఇండియా స్టోరీ’. శ్రేయస్ తల్ఫడే ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ కోర్ట్ రూమ్ డ్రామాకు చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్నాడు. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ బ్యానర్‌పై సాగర్ బి షిండే రైటర్‌గా వ్యవహరిస్తూ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆసక్తిని పెంచగా, జులై 24న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుందని ప్రకటించారు.
త్వరలోనే టీజర్ రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. పురుగుమందుల వ్యవసాయం వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాలను ప్రధానాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ పవర్‌ఫుల్ లాయర్‌గా కనిపించనుంది.
త్వరలో రానున్న టీజర్ ప్రేక్షకులను ‘ది ఇండియా స్టోరీ’ ప్రపంచంలోకి మరింతగా తీసుకెళ్తుందని మేకర్స్ తెలియజేశారు. సుమిత్ బగాడే, అనితా జాధవ్, వినాయక్ సైదాని, కల్పేష్ షా, దేవ్యాని ఖోరాటే సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మంగేష్ ధక్డే సంగీతం అందిస్తున్నాడు.
