
హైదరాబాద్ : రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ప్రవేశ గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఫస్టియర్ ప్రవేశాల గడువు ఆగస్టు 16తో ముగిసింది. అయితే ఇంకా చేరని వారి కోసం గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. అయితే ప్రైవేట్ కాలేజీల్లో చేరేవారు లేట్ ఫీజు కింద రూ.750 చెల్లించాలని, ప్రభుత్వ కాలేజీల్లో చేరేవారు మాత్రం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదంది. ఇప్పటి వరకు ప్రవేశాలు పొందని వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది.