లోక్ సభలో ‘దిశ‘ ప్రకంపనలు…

లోక్ సభలో ‘దిశ‘ ప్రకంపనలు…

వెటర్నడీ డాక్టర్ దిశ ఘటనపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ దిశ ఘటనపై చర్చ జరిగింది. లోక్ సభలో దిశ ఘటనపై చర్చకు అనుమతివ్వాలంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశ  పెట్టారు.  ఈ సందర్భంగా చర్చకు అనుమతివ్వగా.. దిశా కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలన్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. దిశను అత్యంత కిరాతకంగా హత్యచేశారన్నారు. దిశ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారన్నారు. హైదరాబాద్ కు దగ్గర్లోనే ఘటన జరిగిందన్నారు. తెలంగాణలో మద్యం అమ్మకాలు కూడా ఈ ఘటనకు కారణమన్నారు. హైవే పక్కన మద్యం అమ్మకూడదని సుప్రీం కోర్టు చెప్పినా అమ్ముతున్నారన్నారు. లిక్కర్ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలన్నారు.  తెలంగాణ హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు బాధకరమన్నారు.

పోలీసుల నిర్లక్ష్యంతోనే దిశ ఘటన జరిగిందన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. చట్టంలో లోపాలతోనే నిందితులు బయటపడుతున్నారని అన్నారు. నిర్భయం ఘటన జరిగి ఏడేళ్లైనా నేరస్థులకు శిక్షపడలేదన్నారు.

దేశంలో మళ్లీ మళ్లీ ఇవే ఘటనలు జరుగుతున్నాయన్నారు వైసీపీ ఎంపీ వంగా గీత. ఘటనను ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. నేరాలు చేయాలంటే భయపడేలా చేయాలన్నారు. మహిళలను దేశంలో బతకనివ్వండాన్నారు. మద్యం,డ్రగ్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దిశ ఘటన చాలా బాధాకరమన్నారు టీఆర్బా.బాలు.  మహిళలపై దాడులను శాంతిభద్రతల సమస్యగా చూడొద్దన్నారు. మహిళలపై దాడుల మీద కేంద్రం స్పందించాలన్నారు.

ఘటన చాలా బాధాకరమన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. నిందితులకు వెంటనే శిక్షపడాలన్నారు.చట్టాలను కఠినంగా అమలు చేయాలన్నారు. ఇందుకోసం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలన్నారు. చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. చట్టాల్లో కఠినమైన మార్పులు రావాలన్నారు.

హైదరాబాద్ ఘటన సిగ్గుచేటన్నారు ఎంపీ సుప్రియా సూలే. ఘటనపై ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలన్నారు ఎంపీ మాలోతు కవిత. నిర్భయా కేసును తలపించేలా ఉందన్నారు. వెంటనే ఘటనపై యాక్షన్ తీసుకోవాలన్నారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలన్నారు. పార్టీలకు అతీతంగా ఘటనను ఖండించాలన్నారు.

దిశ ఘటన అతి కిరాతకమైన ఘటన అన్నారు రాజ్ నాథ్ సింగ్ .  ఈ ఘటన దేశానికే అవమానకరమన్నారు. అందరినీ కలిచివేసిందన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. చట్టంలో ఎలాంటి మార్పులైనా తీసుకొస్తామన్నారు.