రజినీకాంత్ బాబా సినిమా రీ రిలీజ్

రజినీకాంత్ బాబా సినిమా రీ రిలీజ్

రజినీకాంత్ లాంటి స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుండి సినిమా వస్తోందంటే అభిమానుల ఆనందాన్ని అంచనా వేయలేం. అలాంటి ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌కు ఓ గుడ్ న్యూస్. వచ్చే నెలలో ఆయన నటించిన సినిమా ఒకటి విడుదల కాబోతోంది. అయితే ఇది తలైవా కొత్త సినిమా కాదు.. ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ‘బాబా’. రీ రిలీజ్ రూపంలో  మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలన్నీ ఇటీవల మళ్లీ విడుదలై భారీ వసూళ్లను రాబడుతోన్న విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీని కూడా మరోసారి విడుదల చేయబోతున్నారు. కాకపోతే అప్పట్లో భారీ అంచనాలతో వచ్చిన ‘బాబా’ డిజాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. అయితే రజినీ స్టైల్ అండ్ స్వాగ్, ‘బాబా కౌంట్ స్టార్ట్’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్‌‌‌‌‌‌‌‌ అభిమానుల చేత విజిల్స్ వేయించాయి. రెహమాన్ మ్యూజిక్ మరో హైలైట్. అందుకే రీ రిలీజ్‌‌‌‌‌‌‌‌లో కచ్చితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు టీమ్. డిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాను డిజిటల్‌‌‌‌‌‌‌‌గా క్వాలిటీ పెంచడంతో పాటు రీ ఎడిట్‌‌‌‌‌‌‌‌ కూడా చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌‌‌‌‌‌‌‌ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ చిత్రంలో నటిస్తున్నారు రజినీకాంత్. మరోవైపు లైకా ప్రొడక్షన్స్‌‌‌‌‌‌‌‌లో మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యారు.