Mohammed Malik: సిరాజ్ స్పూర్తితో టీమిండియాలోకి వస్తా.. భారత అండర్-19 జట్టులో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్

Mohammed Malik: సిరాజ్ స్పూర్తితో టీమిండియాలోకి వస్తా.. భారత అండర్-19 జట్టులో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్

ట్రై సిరీస్ కోసం బీసీసీఐ ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌19– ఏ, ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌19– బి జట్లను మంగళవారం (నవంబర్ 11) ప్రకటించింది. ఈ  సిరీస్‌‌‌‌లో ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌19– ఏ, ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌19– బి జట్లతో పాటు అఫ్గానిస్తాన్ అండర్‌‌‌‌‌‌‌‌-19 మూడో జట్టుగా పాల్గొంటుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా ఈ నెల 17 నుంచి 30 వరకు జరిగే ఈ ముక్కోణపు సిరీస్ జరుగుతుంది. జూనియర్ క్రికెట్‌‌‌‌లో దుమ్మురేపుతున్న హైదరాబాద్ యంగ్‌‌‌‌స్టర్ ఆరోన్ జార్జ్‌‌‌‌కు నేషనల్‌‌‌‌ టీమ్‌‌‌‌కు నాయకత్వం వహించే అరుదైన అవకాశం దక్కింది. ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌19– బి జట్టుకు కెప్టెన్‌‌‌‌గా ఎంపికయ్యాడు.

ఈ ట్రై సిరీస్ లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. హైదరాబాద్ నుండి మరో క్రికెటర్ అండర్-19 ఇండియా ఏ టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు. నాంపల్లి మల్లెపల్లికి చెందిన మహమ్మద్ మాలిక్ ను బీసీసీఐ అండర్-19 ఏ టీమ్ లో అవకాశం కల్పించింది. ఈ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ ఇటీవలే జరిగిన అండర్- 19 వినూ మాంకడ్‌ ట్రోఫీలో టాప్ వికెట్ టేకర్ గా నిలిచి జట్టులో స్థానం సంపాదించాడు. మహమ్మద్ మాలిక్ భారత అండర్ 19 జట్టుకు ఎంపిక కావడంతో అతని తండ్రి మహ్మద్ అబ్దుల్ లక్డికపుల్ లో కేక్ కట్ చేసి, టపాసులు పేల్చి సెలెబ్రశాం చేసుకున్నారు. 

Also Read:- RCB ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. చిన్నస్వామిలో మ్యాచ్‌లు లేనట్టే.. కొత్త వేదిక ఎక్కడంటే..?

ఇండియన్ పాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రేరణతో ప్రాక్టీస్ చేసి, అండర్ 19 టీమ్ కు సెలెక్ట్ అయినట్లు మహమ్మద్ మాలిక్ తెలిపారు. ఈ నెల 17న బెంగళూరు వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరగనున్న సిరీస్ లో పాల్గొననున్నట్లు మాలిక్ అన్నారు. భవిష్యత్తులో ఇండియన్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించడం తన డ్రీమ్ అని.. ఆ దిశగా తాను మెరుగైన ప్రదర్శన ఇస్తానని మాలిక్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌‌‌‌కు చెందిన వికెట్ కీపర్ ఆర్‌‌‌‌‌‌‌‌.అలంకృత్‌‌‌‌, వాఫి కచ్చి ఇండియా–ఎ టీమ్‌‌‌‌లో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు విహాన్ మల్హోత్రా కెప్టెన్‌‌‌‌గా వ్యవహరిస్తాడు.


ఇండియా అండర్-19 A స్క్వాడ్:

విహాన్ మల్హోత్రా ( కెప్టెన్), అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), వాఫీ కచ్చి, వంశ్ ఆచార్య, వినీత్, లక్ష్య రాయ్చందనీ, రాపోల్ (వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, అన్మోల్జీత్ సింగ్, మహ్మద్ ఎనాన్, హెనిల్ పటేల్, అశుతోష్ మహీదా, ఆదిత్య రావత్, మహ్మద్ మాలిక్ 

భారత U19 B స్క్వాడ్: 

ఆరోన్ జార్జ్ (కెప్టెన్), వేదాంత్ త్రివేది (వైస్ కెప్టెన్), యువరాజ్ గోహిల్, మౌల్యరాజ్‌సిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), RS అంబరీశ్, బీకే కిషోర్, పుష్పక్, హేమ్చుదేశన్, ఉదవ్ మోహన్, ఇషాన్ సూద్, దీపేష్, రోహిత్ కుమార్ దాస్ (CAB)