IPL 2026: RCB ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. చిన్నస్వామిలో మ్యాచ్‌లు లేనట్టే.. కొత్త వేదిక ఎక్కడంటే..?

IPL 2026: RCB ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. చిన్నస్వామిలో మ్యాచ్‌లు లేనట్టే.. కొత్త వేదిక ఎక్కడంటే..?

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ కు బిగ్ షాక్. 32000 సీటింగ్ కెపాసిటీ ఉన్న చిన్నస్వామి స్టేడియంలో ఇకపై క్రికెట్ ఆడే సూచనలు కనిపించడం లేదు. 2025 జూన్ 4న చిన్నస్వామి స్టేడియంలో విషాదం చోటు చేసుకోవడమే ఇందుకు కారణం. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ విజయోత్సవ వేడుకల తర్వాత జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ పరిణామం తర్వాత భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూసేందుకు చర్యలు చేపట్టాలని కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ తమ హోమ్ మ్యాచ్ లు చిన్నస్వామి స్టేడియంలో ఆడే అవకాశాలు లేనట్టు వార్తలు వస్తున్నాయి.

హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ లు లేకపోవడం ఏ జట్టుకైనా బ్యాడ్ న్యూస్. ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడబోయే తమ మ్యాచ్ లు పుణే వేదికగా పుణే గహుంజేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఎ) స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. ముంబై క్రికెట్ అసోసియేషన్  కమలేష్ పిసల్ మాట్లాడుతూ.. "పూణేలో ఆర్సీబీ మ్యాచ్ లకు ఆతిధ్యమివ్వడం ఇంకా చర్చల్లో ఉంది. ఈ విషయం ఇంకా   ధృవీకరించబడలేదు. తొక్కిసలాట కారణంగా కర్ణాటకలో సమస్య ఉంది. వారు వేరే వేదిక కోసం చూస్తున్నారు. మేము మా స్టేడియంలో మ్యాచ్ లు ఆడుకోమని ఆఫర్ ఇచ్చాము". అని ముంబై క్రికెట్ అధికారి ఒకరు అన్నారు. 

Also Read:-విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ.. డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు నెం.1 వన్ బ్యాటర్ గ్రీన్ సిగ్నల్

ఇటీవలే జరిగిన మహిళల వరల్డ్ కప్ మ్యాచ్ లు కూడా చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించలేదు. ఈ స్టేడియంలో జరగాల్సిన ఐదు మ్యాచ్‌లను నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంకు తరలించారు. చిన్నస్వామి ఈ స్టేడియాన్ని మరపిస్తూ బెంగళూరులో అతి పెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించబోతున్నారు. భవిష్యత్తులో బెంగళూరు నగరంలో కొత్త క్రికెట్ స్టేడియం ఏర్పాటు కానుంది. ఈ స్టేడియం సూర్య సిటీ, బొమ్మసంద్రలో ఉంటుంది. స్టేడియం సీటింగ్ కెపాసిటీ 80,000 కావడం విశేషం. ఇండియాలోనే రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మారనుంది.

ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట తర్వాత బెంగళూరు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బొమ్మసంద్రలోని సూర్య సిటీలో రూ.1,650 కోట్లతో మెగా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఆమోదించారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం తర్వాత ఇండియాలో ఇదే అతి పెద్ద స్టేడియంగా మారనుంది. చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ 32,000 కాగా.. 17 ఎకరాల్లో విస్తరించి ఉంది.