తెలంగాణతో కాకా కుటుంబం ముడిపడింది : లక్ష్మణ్

తెలంగాణతో కాకా కుటుంబం ముడిపడింది : లక్ష్మణ్

హైదరాబాద్ : తెలంగాణతో కాకా కుటుంబం ముడిపడిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షలు లక్ష్మణ్. వివేక్ వెంకటస్వామి, లక్ష్మణ్ ఆధ్వర్యంలో సోమవారం పలు పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన లక్ష్మణ్.. సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాకా 4 తరాలు కాంగ్రెస్ తో ఉన్నారని..బీజేపీ మాత్రమే TRSకు ప్రత్యామ్నాయం అన్నారు. పాలన ఒక కుటుంబానికి కేంద్రీకృతం కావడం.. కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్, TRS లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని.. కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదన్నారు. TRS ప్రథమ కార్యకర్తలాగా పనిచేస్తుందని..నాయకులు కుటుంబ పాలనకు స్వస్తి చెప్పడానికి బీజేపీలో జాయిన్ అవుతున్నారని తెలిపారు. పెండింగ్ బిల్ ల కోసమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు TRSలో జాయిన్ అయ్యారన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం వివేక్ బీజేపీలో జాయిన్ అయ్యారని తెలిపారు లక్ష్మణ్.

పార్టీ కూడా వారికి సరైన గుర్తింపు  ఇస్తుందన్నారు. బీజేపీలో చేరడానికి చాలా మంది రెడీగా ఉన్నారన్న లక్ష్మణ్..KTR, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసి మా మీద రాజకీయ దాడి చేస్తున్నారన్నారు. ఇద్దరు ఒక గూటి పక్షులేనని… దేశం మొత్తం కాంగ్రెస్ ను చీ కొడుతున్నారని చెప్పారు. ఖుంతియా,  ఉత్తమ్ కుమార్ రెడ్డి జ్ఞానం తెచ్చుకోండన్న ఆయన.. సుష్మాస్వరాజ్ ఆ రోజు పార్లమెంట్ లో తెలంగాణకు మద్దతుగా మాట్లాడిందని గుర్తు చేశారు. అప్పట్లో BJPకి తెలంగాణలో ఒక్క ఎంపీ లేకపోయినా మద్దతు ఇచ్చామని.. కాంగ్రెస్ పార్టీ ప్రాంతాల వారిగా విడిపోయి తెలంగాణను రాకుండా  అడ్డుకున్నారన్నారు.  హిందుగాళ్ళు బొందుగాళ్లు అని కేసీఆర్ అంటే కరీంనగర్ జనాలు మీకు  కర్రు కాల్చి వాత పెట్టారని తెలిపారు లక్ష్మణ్.