ఎమ్మెల్సీ ఎన్నికను జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది

ఎమ్మెల్సీ ఎన్నికను జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది

కామారెడ్డి జిల్లా : ఎమ్మెల్సీ ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో జరిగేలా చేస్తున్నామని తెలిపారు కామారెడ్డి జిల్లా కలెకర్టర్ శరత్ కుమార్. గురువారం కామారెడ్డి మున్సిపాలిటీలో ఎమ్మెల్సి ఎన్నిక ఏర్పాట్లను పరిశీలించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్..కోవిడ్-19 నిబంధనల ప్రకారం జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వారిగా ఓటర్ల జాబితా ఇప్పటికే అందజేశామని చెప్పారు. సెక్షన్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లను నియమించామని..జిల్లాలో 341 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.

ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద మెడికల్ ఆఫీసర్, సిబ్బంది అందుబాటులో ఉంటారని..పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఉన్న కార్యాలయాలకు సెలవు ప్రకటించామని తెలిపారు. ఈ ఎన్నికను జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు కలెక్టర్ శరత్ కుమార్.