బస్సు సర్వీసులు ప్రారంభం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

బస్సు సర్వీసులు ప్రారంభం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

బస్సు సర్వీసులను ప్రారంభిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక దూరం పాటిస్తూ రాష్ట్రం పరిధిలో అన్నీ జిల్లాలో బస్సు సర్వీసులను ప్రారంభించేలా నిర్ణయం తీసుకుంది కేరళ రాష్ట్రప్రభుత్వం. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మార్చి 25నుంచి రాష్ట్రంలోని అన్నీ ప్రైవేట్, ప్రభుత్వ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అయితే తాజాగా కేంద్ర సూచనలతో బస్సు సర్వీసులను ప్రారంభించేలా కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (కే ఎస్ ఆర్టీసీ) నిర్ణయించింది. ఆర్ధిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ బస్సులను జిల్లాల వరకు  పరిధి విధిస్తూ అనుమతులిచ్చింది.

బస్సులో 50శాతం మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేయడం,  మాస్క్ లు ధరించడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్‌ చేయడం, కరోనా వైరస్ తగ్గే కొద్ది ఇతర రాష్ట్రాల నుంచి పర్మిషన్లు తీసుకొని బస్సు సర్వీసులు విస్తరిస్తామని కేరళ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఏకే సుశీంద్రన్ తెలిపారు.

సోషల్ డిస్టెన్స్ పాటించడం వల్ల కేఎస్ ఆర్టీసీ నష్టపోవాల్సి వస్తుందని, ఆ భారం రాష్ట్ర ఆదాయంపై ప్రభావం చూపుతుందన్న సుశీంద్రన్…ముందస్తు చర్యల్లో భాగంగా ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచేలా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.