‘ది కేరళ స్టోరీ’ మరో ‘ది కశ్మీర్ ఫైల్స్’ కానుందా..? జనాల్లో ఉత్కంఠ రేపుతున్న ఈ సినిమాలో ఏముంది? సినిమాపై రోజుకో కొత్త వివాదం తెరపైకి వస్తోంది. ట్రైలర్ లో సీన్స్, డైలాగ్స్ కాంట్రవర్సీగా ఉండటంతో.. రాజకీయం దుమారం సైతం చెలరేగింది. మేకర్స్ "ది కేరళ స్టోరీ" అనేది యదార్ధ గాద ఆధారంగా నిర్మించిన చిత్రమని, కేరళలో యువతులను బలవంతంగా మతమార్పిడి చేసి, వారిని ISISలో చేర్చుకునే నేపథ్యంలో ఈ కథ సాగుతుందని అంటున్నారు.
ఇక మొన్నటివరకు వివాదంగా ఉన్న హిజాబ్ ప్రస్తావనను కూడా తీసుకొచ్చారు ఈ మూవీలో. మరి నిజంగా కేరళలో ఇలాంటివి జరుగుతున్నాయా అంటే.. అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. కేరళలో ఐఎస్ స్లీపర్ సెల్స్ ఉన్నాయని, అక్కడి ముస్లిం యువతీయువకులను ఉగ్రవాదంపైపు మళ్లించే ప్రయత్నాలు జరిగాయని గతంలోనే వెల్లడించింది NIA . 2009-2012 మధ్య కాలంలో మార్పిడికి గురైనవారిలో 2667మంది యువతులున్నారని, వారిలో 2195మంది హిందువులు కాగా.. 492 మంది క్రిస్టియన్లు ఉన్నారని తెలిపింది.
దీంతో ద కేరళ స్టోరీ సినిమాపై రాజకీయంగా కూడా దుమారం రేగుతోంది. ఈ క్రమంలోనే.. సినిమాను బహిష్కరించాలని ఆలిండియా ముస్లింజమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వి డిమాండ్ చేశారు. మరి ట్రైలర్ తోనే సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీ విడుదలవుతుందా? ఒకవేళ విడుదలైతే ఇంకా ఎన్ని వివాదాలు తలెత్తుతాయో అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.