
వివాదాల సినిమా ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమాకి ఆడియన్స్ మాత్రం జై కొట్టారు. మే 5న నిరసనల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటిరోజు కలెక్షన్ కొద్దిగా తగ్గినా.. రెండవరోజు మాత్రం అనూహ్యంగా పుంజుకున్నాయి.
తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలో నిరసనలు, ఆందోళనలు జరిగినా అవి మూవీ కలెక్షన్స్ పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేదనే చెప్పాలి. ఇక మొదటిరోజు ఈ సినిమా రూ. 8 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు ఈ సినిమా కలెక్షన్లు 13 నుంచి 14 కోట్ల రేంజ్లో వచ్చాయని అంచనా. ఆదివారానికి ఈ కలెక్షన్లు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల నుండి వస్తున్న సమాచారం. మహారాష్ట్రలో ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. షారూఖ్ హీరోగా వచ్చిన పఠాన్ హిట్ తర్వాత ఏ సినిమా కూడా ఆడియన్స్ ని అంతగా అలరించకపోవడంతో.. తలలు పట్టుకున్న ఎగ్జిబిటర్లు కేరళ స్టోరీ విజయంతో సంబరాలు చేసుకుంటున్నారు.
లో బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే హిట్ తెచ్చుకోవడంతో ఫైనల్ రన్లో పెద్ద బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన అదా శర్మ మంచి మార్కులే పడుతున్నాయి. సిద్ది ఇదాని, యోగితా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీ క్లోజ్ అయ్యే వరకు ఏ రేంజ్ లో వసూళ్లను రాబడుతుందో చూడాలి మరి.