
ది కేరళ స్టోరీ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. మొదటి రోజు కొన్ని చోట్ల అల్లర్లు జరిగినా.. అవి కలెక్షన్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేదు. మొదటి రోజు కంటే రెండో రోజు ఈ సినిమా అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆనందం వ్యక్తం చేశారు.
ఇక ఈ సినిమా కూడా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కడంతో డిస్ట్రిబ్యూటర్స్ కు భారీగానే లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇక విడుదలైన మూడు రోజుల్లోనే ఈ మూవీ దాదాపు రూ. 35 కోట్లు వసూలు చేసి కొత్త రికార్డు సృష్టించింది. కానీ, కొన్ని థియేటర్లు షోస్ నిలిపేస్తుండటంతో నిర్మాతల్లో ఆందోళన చెందుతున్నారు. దీంతో ‘ది కేరళ స్టోరీ’ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ సినిమా OTT హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ జీ 5ఇప్పటికే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్ర డిజిటల్ ప్రీమియర్ ను.. థియేట్రికల్ విడుదలైన 46 రోజుల తర్వాత అంటే జూన్ మూడవ వారంలో స్ట్రీమ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన 'ది కేరళ స్టోరీ' మూవీని విపుల్ అమృతలాల్ షా నిర్మించారు. అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు.