ది కేరళ స్టోరీ టీమ్ కొత్త మూవీ "బస్తర్".. ఇది కూడా సంచలనమే

ది కేరళ స్టోరీ టీమ్ కొత్త మూవీ "బస్తర్".. ఇది కూడా సంచలనమే

ది కేరళ స్టోరీ(The kerala story) మూవీ టీమ్ తమ కొత్త సినిమాను ప్రకటించింది. ఈ సినిమా కూడా ది కేరళ స్టోరీ సినిమాలాగే ట్రూ ఇన్సిడెన్స్ తో రానుందని ఈ ప్రకటనలో తెలిపింది. ఇక ది కేరళ స్టోరీ సినిమా రిలీజ్ అయ్యి 50 రోజులు అయిన సందర్భంగా మేకర్స్ నుంచి ఈ అనౌన్స్మెంట్ వచ్చింది.

ఈ కాంబోలో వస్తున్న సెకండ్ మూవీకి ‘బస్తర్(Bastar)’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. బస్తర్ అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దట్టమైన అటవీ ప్రాంతం. ఇది నక్సల్స్ కు కోర్ ఏరియా. బస్తర్ జిల్లాలో నక్సల్స్ కి, ఇండియన్ ఆర్మీకి మధ్య పరస్పరం కాల్పులు జరుగుతూనే ఉంటాయి. రెడ్ కారిడార్ లో భాగమైన ఈ ప్రాంతంలో ఏటా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అలాంటి ప్రాంతంలో జరిగే వాస్తవిక కథతో ‘బస్తర్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు అంటే సుదీప్తో సేన్(Sudopti sen) ప్రకటించారు.

ఇక ఈ సినిమా కూడా మరోసారి వివాదాలకు కేంద్రబిందువు అయ్యే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఎందుకంటే సినిమా కోసం ఎంచుకున్న కథ అలాంటిది. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ మూవీ.. ఎలాంటి విమర్శలకు కేరాఫ్ గా మారుతుందో చూడాలి మరి.