పెద్ద ఇండ్లకే డిమాండ్.. మెజారిటీ జనానికి ఇవే ఇష్టం

పెద్ద ఇండ్లకే డిమాండ్.. మెజారిటీ జనానికి ఇవే ఇష్టం
  • పెద్ద ఇండ్లకే డిమాండ్.. 
  • మెజారిటీ జనానికి ఇవే ఇష్టం 
  • రూ.45 లక్షలు - రూ.90 లక్షల ఇండ్లకు మస్తు గిరాకీ
  • వెల్లడించిన అనరాక్​ సర్వే

న్యూఢిల్లీ : దేశమంతటా ఇండ్ల ధరలు అధికమవుతున్నప్పటికీ మిడ్ ​రేంజ్​, ప్రీమియం ఇండ్లను ఇష్టపడే జనం సంఖ్య పెరుగుతోందని తాజా సర్వే వెల్లడించింది. అనరాక్​ కన్జూమర్ ​సెంటిమెంట్​ సర్వే ప్రకారం (2023 హెచ్​1) ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 59 శాతం మంది ఇండ్ల కొనుగోలుదారులు రూ. 45 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల ధర కలిగిన ఇండ్లను ఇష్టపడుతున్నారు. రూ. 45 లక్షలు–-90 లక్షల మధ్య ధర ఉన్న ఇండ్లు కావాలని 35 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పగా, 24 శాతం మంది రెస్పాండెంట్లు రూ. 90 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల మధ్య ధర ఉన్న ఇండ్లు ఇష్టమని తెలిపారు.

బెంగళూరు, చెన్నై, పూణే, ఢిల్లీ- ఎన్సీఆర్​, కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా, ముంబై, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5,218 మంది నుంచి వివరాలు సేకరించి ఈ సర్వే చేశారు. ఈ ఏడాది హెచ్​1లో (మొదటి ఆర్నెళ్లు) బడ్జెట్​ ఇండ్ల ప్రాధాన్యత 25 శాతానికి ( 2020 హెచ్2 సర్వేలో 40 శాతం నుంచి) తగ్గింది .   ఇతర యూనిట్ల కంటే 3 బీహెచ్​కేలకు డిమాండ్ పోస్ట్- పాండమిక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువగా ఉంది. బెంగుళూరు, చెన్నై, పూణె  ఢిల్లీ-ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో 3 బీహెచ్​కేలకు అత్యధిక డిమాండ్ నమోదయింది. కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా, ముంబై, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలలో 2 బీహెచ్​కే ఇండ్లకు అధిక డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనిపించింది.  2023 హెచ్1 నాటికి, కొత్త ప్రయోగాలకు సిద్ధంగా ఉన్న ఇండ్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది.

ధరలు పెరిగితే ఇబ్బందే

ధరల పెరుగుదల  66 శాతం మంది రెస్పాండెంట్ల ఆదాయాలను ప్రభావితం చేసింది. కరోనా,  రష్యా–-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా,  భారతదేశంలోనూ చాలా మంది ఆర్థిక పరిస్థితి మందగించింది. నగరాల్లోని ఇండ్ల విక్రయాలపై ప్రభావం ఇంకా కనిపించలేదు. అయితే వీటి ధరలు ఇంకా పెరిగితే మాత్రం అమ్మకాలు తగ్గవచ్చు.  హౌజింగ్​ లోన్ ​రేట్లు 9.5 శాతం మార్కును దాటితే, రెసిడెన్షియల్ అమ్మకాలపై 'అధిక ప్రభావం' ఉంటుందని 98 శాతం సర్వే రెస్పాండెంట్లు తెలిపారు. బడ్జెట్ ఇండ్లకు డిమాండ్ విషయానికొస్తే, ప్రస్తుత ఎడిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  25 శాతానికి తగ్గిపోయింది. రూ. 40 లక్షలలోపు ఇండ్ల డిమాండ్ 2022 హెచ్1లో 28 శాతం నుంచి 2023 హెచ్1లో 25 శాతానికి తగ్గింది. ఇన్​ఫ్లేషన్,  ఆర్థిక మందగమనం ఈ కేటగిరీ వారిని తీవ్రంగా దెబ్బతీసింది. వీరిలో చాలా మంది వేచిచూద్దాం అనే ధోరణితో ఉన్నారు. 

పెద్ద ఇండ్లకు కూడా డిమాండ్  ఉంది. 2 బీహెచ్​కేల కంటే 3 బీహెచ్​కేలకు డిమాండ్​ పెరిగింది. దాదాపు 48 శాతం మంది 3 బీహెచ్​కేలను ఇష్టపడ్డారు. అయితే 39 శాతం మంది ఇప్పటికీ 2 బీహెచ్​కే యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఇష్టపడుతున్నారు. 2022 హెచ్1 సర్వేతో పోలిస్తే, 3 బీహెచ్​కేలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.  ఇది 2022 హెచ్1 లో దాదాపు 41 శాతం ఉండగా,  2023 హెచ్1లో దాదాపు 48 శాతానికి చేరుకుంది. కరోనా తర్వాత జీవితం సాధారణ స్థితికి వచ్చినప్పటికీ పెద్ద ఇండ్లకు ఆదరణ తగ్గలేదు. 

- అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి