రుణమాఫీ డబ్బులు రూ. 1.96 లక్షలు లాక్కొని పరార్

రుణమాఫీ డబ్బులు రూ. 1.96 లక్షలు లాక్కొని పరార్
  • బ్యాంకు నుంచి డ్రా చేసుకుని వెళ్తున్న దంపతులు
  • స్కూటీపై ఫాలో అయి కొట్టేసిన దుండగుడు 
  • నిజామాబాద్ జిల్లా జన్నేపల్లిలో ఘటన


నవీపేట్, వెలుగు : రుణమాఫీ డబ్బులను బ్యాంక్ నుంచి డ్రా చేసుకుని వెళ్తున్న దంపతులను గుర్తుతెలియని వ్యకి ఫాలో అయి లాక్కొని పారిపోయారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నేపల్లిలో చోటు చేసుకుంది.  ఎస్ఐ వినయ్ కుమార్, స్థానికులు తెలిపిన ప్రకారం.. మాక్లూర్ మండలం వల్లభాపూర్ కు చెందిన దెబ్బ చిన్నయ్య, గంగామణి దంపతులు రుణమాఫీ డబ్బులు తెచ్చుకునేందుకు బుధవారం నవీపేట్ మండలం జన్నేపల్లిలోని కెనరా బ్యాంక్ కు వెళ్లారు. 

రుణమాఫీ రెన్యూవల్ చేయించుకుని రూ. 1.96 లక్షలను తీసుకుని బైక్ పై దంపతులు ఇంటికి వెళ్తున్నారు. మార్గమధ్యలో గుర్తు తెలియని వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని స్కూటీ పై ఫాలో అయి ఆకస్మాత్తుగా గంగామణి చేతిలోని డబ్బుల కవర్ లాక్కొని పారిపోయాడు. దీంతో బైక్ పై నుంచి దంపతులు కిందపడడంతో గాయాలు అయ్యాయి. బాధితుడు చిన్నయ్య ఫిర్యాదు చేయగా నార్త్ రూరల్ సీఐ సతీశ్​కేసు నమోదు చేసి.. దర్యాప్తులో భాగంగా ఘటనా స్థలానికి వెళ్లి సీసీ కెమెరాలను పరిశీలించారు.