కలయా నిజమా..సుడిగాలి సుధీర్

కలయా నిజమా..సుడిగాలి సుధీర్

టీవీ షోలతో పాపులారిటీ తెచ్చుకుని హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు సుడిగాలి సుధీర్. తను నటిస్తున్న చిత్రాల్లో ‘కాలింగ్ సహస్ర’ ఒకటి. అరుణ్ విక్కిరాలా ద‌‌‌‌ర్శక‌‌‌‌త్వంలో విజేష్ త‌‌‌‌యాల్‌‌‌‌, చిరంజీవి ప‌‌‌‌మిడి, వెంక‌‌‌‌టేశ్వర్లు క‌‌‌‌టూరి నిర్మిస్తున్నారు. డాలిశ్య హీరోయిన్‌‌‌‌. ఈ చిత్రం నుంచి బుధవారం ‘కలయా నిజమా’ అనే లిరికల్ సాంగ్‌‌‌‌ను రిలీజ్  చేశారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో సుధీర్ మాట్లాడుతూ ‘మోహిత్ రెహ‌‌‌‌మానిక్‌‌‌‌ ట్యూన్ చేసిన పాటకు లక్ష్మి ప్రియాంక చక్కని లిరిక్స్ రాశారు. కె.ఎస్.చిత్ర పాడిన విధానం అందర్నీ ఆకట్టుకుంటుంది.  మూడేళ్ల క‌‌‌‌ష్టం ఈ సినిమా. చాలా స్ట్రగుల్స్ దాటి ఈ స్టేజ్‌‌‌‌కి చేరుకున్నాం. సినిమా అందరికీ నచ్చుతుంది’ అని చెప్పాడు. హీరోయిన్ డాలిశ్య, శివ బాలాజీతో పాటు టీమ్ అంతా పాల్గొన్నారు.