కండీషన్స్ పెడితే ఇలాగే ఉంటుంది.. అవన్నీ ముందే చూసుకోవాలి

 కండీషన్స్ పెడితే ఇలాగే ఉంటుంది.. అవన్నీ ముందే చూసుకోవాలి

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ దీపికా పదుకునే చాన్స్​ను మహానటి కీర్తి సురేశ్​ కొట్టేసింది. దీపికా, శింబుతో ఓ తమిళ సినిమా చేయడానికి భారీ రెమ్యునరేషన్​ డిమాండ్ చేసిందనే వార్తలు వినిపించాయి. అంతేకాదు కొన్ని కండీషన్స్ కూడా పెట్టిందట. దీంతో ఖంగుతిన్న మేకర్స్..  ఆమె స్థానంలో కీర్తి సురేశ్​ను ఒకే చేసినట్టు తెలుస్తోంది. ఇందులో మరో బాలీవుడ్​ నటిని కూడా ఎంపిక చేశారట. 

కోలీవుడ్​ నుంచి తెలుగు పరిశ్రమకు పరిచయమైన కీర్తి మహానటితో ఇక్కడ స్టార్​  డంను దక్కించుకుంది. ఇక చాలాకాలం తరువాత మళ్లీ ఇప్పుడు తమిళంలో బిజీగా మారనుంది. ఇప్పటికే శివకార్తికేయన్​, ధనుష్ తో చేసిన సినిమాలు రిలీజ్​కు సిద్ధమవుతున్నాయి. ఇటీవల శింబు నటించిన ఓ సినిమా తమిళ నాట మంచి హిట్టందుకుంది. దీంతో కీర్తి కూడా ఈ హీరో సినిమాకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్టు తెలుస్తోంది.

 ఇక తెలుగులో ఈ మధ్యే నాని దసరా సినిమాతో సక్సెస్​ కొట్టిన కీర్తి.. ప్రస్తుతం చిరంజీవితో భోళా శంకర్​ లో నటిస్తోంది. ఇందులో ఆమె చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది.