టైగర్‌ నాగేశ్వరరావు మూవీ రన్టైమ్ తగ్గింపు.. ఎందుకంటే ?

టైగర్‌ నాగేశ్వరరావు మూవీ రన్టైమ్ తగ్గింపు.. ఎందుకంటే ?

మాస్‌ మహారాజా రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ పాన్‌ ఇండియా మూవీ టైగర్‌ నాగేశ్వరరావు(Tiger Nageswara rao). స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు వంశీ(Vamsee) తెరకెక్కించారు. ఈ సినిమా అక్టోబర్ 20 న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి..పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం టైగర్‌ నాగేశ్వరరావు సినిమా రన్‌టైమ్‌ ను తగ్గించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా గం.3.02 నిమిషాల నిడివితో రిలీజై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. కానీ మెజారిటీ ఆడియన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్‌ను దృష్టిలో ఉంచుకునే నిడివి తగ్గించినట్లు మేకర్స్ తెలిపారు. దీంతో సినిమా రన్ టైమ్ 2.37 గంటలకు తగ్గింది. సుమారు అరగంట నిడివి కట్ చేయగా.. ఆడియన్స్ ను మరింత అలరించేందుకే మేకర్స్ ఈ  ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ట్రైన్ సీక్వెన్స్,  చెన్నైలో పోర్ట్ సీక్వెన్స్, జైలు నుంచి తప్పించుకునే సీక్వెన్స్..ఇలా చాలా వండర్ ఫుల్ సీన్స్  ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. 

ఈ మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు.  జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్ కీలక పాత్రల్లో నటించారు.