
రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ మండలంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో అన్నను చంపాడు ఓ తమ్ముడు . ఆరెంజ్ కంపెనీకి చెందిన కార్గో వాహనంలో మేడ్చల్ నుండి చెన్నైకి అన్నదమ్ములు ఇద్దరు ప్రయాణిస్తున్నారు. దీంతో పాత గొడవలను మనస్సులో పెట్టుకున్న తమ్ముడు.. డ్రైవింగ్ సీటులో ఉన్న అన్నను కత్తితో పొడిచి చంపాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.