
హైదరాబాద్ లో భారీ కార్పొరేట్ స్కాం బయటపడింది. రూ. 200 కోట్ల కంపెనీ షేర్స్ ను హీరా మల్టీ వెంచర్స్ యాజమాన్యం 10 మంది కుటుంబ సభ్యులకు బదలాయించింది. కంపెనీలోని 15 శాతం షేర్స్ ను అక్రమంగా 85 శాతానికి పెంచుకుంది. దీంతో బాధితులు నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. హీరా మల్టీ కంపెనీలో ఇల్లీగల్ గా షేర్స్ ట్రాన్స్ ఫర్ జరిగిందని NCLT గుర్తించింది. బాధితులకు షేర్స్ తిరిగి అప్పగించాలని NCLT ఆదేశించింది . సౌదీకి చెందిన అబ్దుల్ రజాక్ అలియాస్ అదీ అలీపై ఇప్పటికే హైదరాబాద్ లో పలు కేసులు ఉన్నాయి.
గతంలో ఇదే యాజమాన్యంపై హైదరాబాద్ లో సీఐడీ, ఈడీలో సైతం కేసులు నమోదయ్యాయి. సీఐడీ కేసులో గతంలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యాయి. డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్ కంచర్ల కంపెనీని రూ.500కోట్ల వరకు హీరా మల్టీ యాజమాన్యం మోసం చేసింది. వికారాబాద్ ఊటీ గోల్ఫ్ కోర్స్ కేసులో గతంలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. NCLT ఆదేశాలతో హీరా కంపెనీపై బాధితులు క్రిమినల్ చర్యలకు సిద్దమవుతున్నారు.