క్యాంటిన్లో బీఫ్ బ్యాన్ చేసిన మేనేజర్.. బ్యాంకు ముందే బీఫ్ ఫెస్టివల్ చేసుకున్న ఉద్యోగులు.. కేరళలో తీవ్ర వివాదం

క్యాంటిన్లో బీఫ్ బ్యాన్ చేసిన మేనేజర్.. బ్యాంకు ముందే బీఫ్ ఫెస్టివల్ చేసుకున్న ఉద్యోగులు.. కేరళలో తీవ్ర వివాదం

కేరళలో బ్యాంకు ఉద్యోగులు ఏర్పాటు చేసిన బీఫ్​ ఫెస్టివల్ తీవ్ర వివాదస్పదం అయ్యింది. ఉద్యోగుల నుంచి రాజకీయ పార్టీలకు అంటుకుంది వివాదం. బీఫ్​ కు అనుకూలంగా.. వ్యతిరేకంగా ఉద్యమాలు, నినాదాలతో వీధులు మార్గోగాయి. ఏం తినాలో కూడా మీరే నిర్ణయిస్తారా అంటూ ఉద్యోగులు బ్యాంకు ముందే బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి ఆందోళనకు దిగటం చర్చనీయాంశంగా మారింది. 

ఉద్యోగులు చెప్పిన వివరాల ప్రకారం.. ఇటీవలే బీహార్ నుంచి కేరళకు ట్రాన్స్ఫర్ అయిన రీజినల్ మేనేజర్ అశ్వనీ కుమార్.. బ్యాంకు క్యాంటిన్ లో బీఫ్ వండకాన్ని నిషేధించారు. మేనేజర్ నిర్ణయానికి వ్యతిరేకంగా గురువారం (ఆగస్టు 28) నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు ఉద్యోగులు. గురువారం బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి నిరసన తెలిపారు. 

ALSO READ : గణేష్ మండపం దగ్గర ప్రసాదం కోసం గొడవ

అంతకు ముందు బ్యాంకు మేనేజర్ ఒక ఉద్యోగిని వేధించినట్లు తెలియటంతో బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్​ ఇండియా ( BEFI ) ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు ఉద్యోగులు. ఆ తర్వాత బీఫ్​ బ్యాన్ కూడా చేశారని తెలిసి స్ట్రైక్ ను మరింత ఉధృతం చేశారు. నచ్చిన ఆహారం తీసుకోవడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు.. దాన్ని కాలరాసే హక్కు ఎవరికీ లేదని ఉద్యోగులు అంటున్నారు. అయితే దీనిపై కెనరా బ్యాంకు సెంట్రల్ బ్రాంచ్ ఇప్పటికీ స్పందించలేదు. 

ఉద్యోగుల స్ట్రైక్ తో మొదలైన ఆందోళన రాజకీయ ఉద్యమంగా మారింది. కొచ్చి వీధుల్లో రాజకీయ పార్టీలు ర్యాలీలు నిర్వహించాయి. కేరళ సంస్కృతిలో బీఫ్​ ఒక భాగం. ఇప్పుడు కొత్తగా బీఫ్ బ్యాన్ చేయడమేంటని పలువురు నేతలు, ప్రజా సంఘాలు ప్రశ్నించాయి. అయితే 2017 నుంచి కేరళలో బీఫ్​ వినియోగంపై వివాదాస్పద ఘటనలు జరుగుతున్నాయి.