గణేష్ మండపం దగ్గర ప్రసాదం కోసం గొడవ : 35 ఏళ్ల వ్యక్తిని కొట్టి మరీ చంపిన కుర్రోళ్లు

గణేష్ మండపం దగ్గర ప్రసాదం కోసం గొడవ : 35 ఏళ్ల వ్యక్తిని కొట్టి మరీ చంపిన కుర్రోళ్లు
  • సమాజంలో పెరుగుతున్న హింస
  • ఢిల్లీ కల్కాజీ మందిర్ ఘటన ఒక హెచ్చరిక

ఇంత వాయిలెంట్ గా ఉన్నారేంట్రా బాబూ.. గుడిలోకి వెళ్లేది భక్తి, ప్రశాంతతకోసం..అలాంటి  ప్రసాదం పెట్టేందుకు ఆలస్యం అయితే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? భక్తిభావన వదిలిపెట్టి భయోత్పాతాన్ని సృష్టిస్తారా? ఢిల్లీలోని ప్రసిద్ధ కల్కాజీ మందిర్‌లో ఓ చిన్న వివాదం భయానక హింసకు దారితీసింది. ప్రసాదం (చున్నీ ప్రసాదం) పంపిణీ విషయంలో భక్తులు ,ఆలయ సేవకుడు మధ్య ఏర్పడిన గొడవ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. 

యోగేంద్ర సింగ్ గత 15 ఏళ్లుగా కల్కాజీ ఆలయంలో సేవదార్ గా పనిచేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌కు చెందిన యోగేంద్రసింగ్ పై సుమారు 15 మంది వ్యక్తులు ఇనుప కడ్డీలు, కర్రలతో అతన్ని దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలి పోయారు. అతన్ని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ట్రామా సెంటర్‌కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. 

ALSO READ : లోక్ సభ, రాజ్యసభ మధ్య తేడాలు

ఆలయానికి వచ్చిన కొందరు వ్యక్తులు ప్రసాదం విషయంలో జరిగిన చిన్న గొడవతో దారుణంగా కొట్టారు. గుంపుగా వచ్చిన మూక ఇనుప రాడ్లు, కర్రలతో సేవాదార్ పై దాడి చేసి , పిడిగుద్దులు కురిపించారు. తీవ్ర గాయాలపాలైన సేవాదార్ ను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. సీసీటీవీ లో రికార్డయిన ఈ ఘటన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో పోలీసులు నిందితుల్లో ఒకరిని పట్టుకొని విచారణ చేస్తున్నారు. 

ఒక చిన్న వివాదం..- ప్రసాదం కోసం వేచి ఉండమని చెప్పడం - ఇంతటి దారుణ హత్యకు దారితీయడం..మన సమాజంలో సహనం, సహకారం తగ్గుతున్నట్లు చూపిస్తుంది. శాంతి ,భక్తి ఉండాల్సిన వారు, ఇటువంటి ఘటనలు మతపరమైన స్థలాల్లో కూడా జరుగుతున్నాయి.ఈ ఘటన భారతీయ సమాజంలో పెరుగుతున్న హింసాత్మక ప్రవర్తనకు ఒక స్పష్టమైన ఉదాహరణ.