ఈటల కబ్జా చేసినట్లు రిపోర్ట్

ఈటల కబ్జా చేసినట్లు రిపోర్ట్

ఈటల రాజేందర్ భూకబ్జాపై సర్కారుకు మెదక్ కలెక్టర్ రిపోర్టిచ్చారు. అచ్చంపేట గ్రామంలో స‌ర్వే నెం. 77, 78, 79, 80, 81, 82, 130లో భూమి క‌బ్జాకు గురైన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. 66 ఎకరాల ఒక గుంట కబ్జాకు గురైందని రిపోర్ట్ లో తెలిపారు. వెనుకబడిన వర్గాలకు చెందిన భూమి కబ్జాకు గురైందని తేల్చారు అధికారులు. ఈ భూముల్లో పౌల్టీ షెడ్లు, ప్లాట్ ఫాములు నిర్మించారని తెలిపారు. రోడ్డు నిర్మాణం కోసం చాలా చెట్లు చట్టవిరుద్ధంగా నరికేశారని మెదక్ డీఎఫ్ఓ రిపోర్ట్ ను జతచేశారు. కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సర్కారుకు సూచించారు. కొన్ని వ్యవసాయ పట్టా భూములను అనుమతి లేకుండా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా మార్చారని కలెక్టర్ రిపోర్ట్ లో తెలిపారు.  పూర్తి వివరాలతో త్వరలోనే మరో రిపోర్ట్ ను ఇస్తామని సర్కారుకు తెలిపారు మెదక్ కలెక్టర్.